లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రం సమీపంలోని మత్తడి పోచమ్మ ఆలయం వద్ద శనివారం మన్నేకుల సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అథితిగా రాష్ట్ర అధ్యక్షుడు మన్నే సుధాకర్ హాజరై, మాట్లాడారు. మన్నే కులస్తులు పూర్వం రాజుల వద్ద బటులుగా పనిచే యడం వల్ల మన్నే వీరులు పేరు వచ్చినట్లు పేర్కొ న్నారు. మన్నే కులస్తుల హక్కుల సాధన కోసం కలిసికట్టు పోరాటాలు చేస్తామన్నారు. అనంతరం జిల్లా, మండల కమిటీలను ఎన్నుకున్నారు. కామారెడ్డి జిల్లా కమిటీ అధ్యక్షుడుగా ఎడ్ల కిషన్(ఎల్లారెడ్డి), ప్రధాన కార్యదర్శిగా దండెం నవీన్(కొండాపూర్), కోషాధికారిగా ఇంటెనుక కాశీరాంలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. లింగంపేట మండల కమిటీ అధ్యక్షుడిగా ముదాం స్వామి, ఉపాధ్యక్షులుగా క్యాతం బాలయ్య, భూదయ్య, శంకర్, అశోక్, కార్యదర్శులుగా ముదాం సాయిలు, శ్రీనివాస్, సంగారెడ్డి, బాల్‌రాజు, సాయిబాబా, తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలయ్య, గౌరవ అధ్యక్షుడు నర్సింలు, ప్రధాన కార్యదర్శి బాబు, కోషాధికారి సిద్దు, నాయకులు నాగభూషణం, యాదగిరి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


