నవీపేట: మండలంలోని అనంతగిరి సమీపంలో శనివారం రా త్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహంతం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బాజా వెంకటేశ్ (53) మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. అనంతగిరి శివారు నుంచి రెడ్డి ఫారానికి ఇసుకను ట్రాక్టర్‌లో తీసుకువస్తుండగా వెనుక నుంచి వస్తున్న ప్యాసింజర్ ఆటో ఓవర్ టేక్ చేసిందన్నారు. దీంతో ట్రాక్టర్ అదుపుతప్పి పంట పొలాల్లో పడగా ఇంజిన్ వెంకటేశ్‌పై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ శ్రీనివాస్‌తోపాటు మరో ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని పేర్కొన్నారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.


