లింగంపేట(ఎల్లారెడ్డి): వైద్యం కోసం వచ్చిన గ ర్భిణితో ఓ నర్సు దురుసుగా ప్రవర్తించిన ఘట న లింగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు ఇ లా.. లింగంపేట మండ లం నల్లమడుగు గ్రామానికి చెందిన పూజిత తొ మ్మిది నెలల గర్భిణీ. లింగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శనివారం వచ్చి, డ్యూటీలో ఉన్న నర్సు ప్రతిభరాణి వద్దకు వెళ్లి మూడో డోసు ఇంజక్షన్‌తోపాటు వైద్య పరీక్షలు చేయమని అడిగింది. దాంతో ఆమె ‘ఇంజక్షన్ లేదు ఏమిలేదు పో’ డాక్టరమ్మ లేదు అంటూ దురుసుగా మాట్లాడింది. వైద్యం చేయము ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అంటూ తేల్చి చెప్పడంతో గర్భిణీ గర్భిణీ పీహెచ్‌సీ ఆరుబయట నిరసన తెలుపుతూ కూర్చుంది. ఈ విషయమై పీహెచ్‌సీ వైద్యురాలు హిమబిందును వివరణ కోర గా.. పూజిత మూడో డోసు ఇంజక్షన్ కోసం ఆస్ప త్రికి వచ్చిన విషయం వాస్తవమే అన్నారు. డాక్టర్ సమక్షంలోనే ఇంజక్షన్ ఇస్తారు. దీంతో నర్సు ఇంజక్షన్ ఇవ్వడానికి నిరాకరించింది.డాక్టర్ వచ్చిన తర్వాత పీహెచ్‌సీకి పూజిత వచ్చి వైద్యం పొందినట్లు తెలిపారు. నర్సు దురుసుగా మాట్లాడడం సరికాదని, సమస్యను పరిష్కరిస్తామని అన్నారు.


