అందరూ అర్హులే..
ఎల్లారెడ్డి : ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగి, ప్రయాణి కులు గాయపడితే తోటి వాహనదారులు చూసీచూడకుండా పోవడం పరిపాటే. కొందరైతే ప్రమాద స న్నివేశాన్ని సెల్‌ఫోన్లలో చిత్రీకరించి పోస్టులు పె డుతుంటారు.. కానీ బాధితులను పట్టించుకోరు. దీంతో ఇలాంటి పరిస్థితులు నెలకొనకుండా కేంద్ర ప్రభుత్వం రహ–వీర్ (మంచి సమరయోధుడు) అ నే పథకాన్ని ప్రారంభించింది. ఎవరైన రోడ్డు ప్రమాదాల్లో గాయపడితే క్షతగాత్రులను ఆస్పత్రులకు స రైన సమయంలో చేర్చిన వారికి రూ.25వేల నగదు పారితోషికం, ప్రశంసాపత్రంను ఈ పథకం కింద అందజేస్తుంది. వీరికి ప్రమాద విషయమై పోలీసుల నుంచి ఎలాంటి వేధింపులు కూడా ఉండవని అధికారులు అంటున్నారు. ప్రమాద బాధితులను ఒక రు కంటే ఎక్కువ మంది కాపాడినట్లైతే పారితోషికా న్ని వారికి సమానంగా పంచబడుతుందని అధి కారులు తెలిపారు.
సంవత్సరానికి ఐదుసార్లు..
ప్రమాదం జరిగిన మొదటి గంట సమయం అత్యంత ప్రధానమైందని అంటుంటారు. వైద్యుల పరిభాషలో ఈ గంటను గోల్డన్ అవర్ అని అంటుంటారు. రోడ్డు ప్రమాద బాధితులకు ఈ మొదటి గంట స మయంలో వైద్య సహాయం అందిస్తే వారి ప్రాణాల ను రక్షించే అవకాశం ఎక్కువగా ఉంటుందని వై ద్యులు అంటున్నారు. కీలకమైన గోల్డెన్ అవర్‌లో బాధితులను ఆస్పత్రికి తరలించిన వ్యక్తులను కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (మినిస్టీ అఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్) రహ–వీర్ పు రస్కారంతో సత్కరించనుంది. ఏడాది కాలంలో ఐ దు సార్లు ఈ నగదు పారితోషికాన్ని పొందవచ్చున ని రవాణా, పోలీసు అధికారులు అంటున్నారు. సంవత్సర కాలంలో ఎక్కువ సార్లు అవార్డు పొందిన వారి గురించి కేంద్ర మంత్రిత్వ శాఖకు సిఫార్సు చే స్తామని అధికారులు తెలిపారు. వారిలో 10 మంది కి జాతీయ స్థాయిలో అవార్డును ప్రకటించి వారికి లక్ష రూపాయల నగదు పారితోషికంతోపాటు జాతీ య స్థాయి ప్రశంసాపత్రాన్ని అందచేస్తారని తెలిపా రు. ప్రజలలో బాధ్యతారాహిత్యాన్ని తగ్గించి ప్ర మాదం జరిగినప్పుడు క్షతగాత్రులను కాపాడేందు కు పురికొల్పేందుకు ఈ పఽథకాన్ని ప్రారంభించిన ట్లు అధికారులు తెలిపారు.
రోడ్డు ప్రమాదాల్లో గాయప డ్డ బాధితులను రక్షించేందు కు ఏర్పాటు చేసిన రహ–వీ ర్ అవార్డు పొందేందుకు ప్ర తీ ఒక్కరు అర్హులే. ప్రమాద బాధితులను సరైన సమయంలో ఆస్పత్రులకు చేరవేసేందుకు ప్రజలు తో డ్పడాలనే ఉద్ధేశంతో ఈ పఽథకాన్ని ప్రవేశపెట్టారు. బాధితులను ఆస్పత్రులకు చేర్చి పోలీసులకు సమాచారం అందించిన వారికి ఎలాంటి పోలీసుల వేధింపులు ఉండవు.
–శ్రీనివాస్‌రావు, డీఎస్పీ, ఎల్లారెడ్డి
నమోదు ఇలా..
బాధితులను ఆస్పత్రికి తరలించిన తర్వాత స దరు వైద్యుడి నుంచి ధృవీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం పోలీసులు విచారణ జరిపి అధికారిక లెటర్ ప్యాడ్‌లో రహ–వీర్ పేరు, మొబైల్ నెంబర్, చిరునామా, ప్రమాదం జరిగిన ప్రదేశం, తేదీ–సమయం, బాధితులను కాపాడడంలో అతను ఎలా సహాయం చేశాడు. అనే వివరాలను నమోదు చేస్తారు. ఇందుకు గా ను పోలీసులు ఆ వ్యక్తికి వివరాలు సేకరించిన ట్లు రసీదు కూడా ఇస్తారు. రసీదు కాపీని సంబంధిత పోలీస్ స్టేషన్ ద్వారా అప్రూవల్ కమిటీ కి పంపిస్తారు. అప్రూవల్ కమిటీలో జిల్లా మెజిస్ట్రేట్, ఎస్పీ, వైద్యాధికారి, రవాణా శాఖ అధి కారి ఉంటారు. కమిటీ ఎంపిక చేసిన వ్యక్తులకు రహ–వీర్ అవార్డు మొత్తాన్ని రవాణాశాఖ ద్వా రా వారి ఖాతాల్లోకి జమచేస్తారు.
రోడ్డు ప్రమాద క్షతగాత్రులను
కాపాడిన వారికి ప్రోత్సాహకం
నగదుతోపాటు సర్టిఫికెట్ అందజేత
నూతన పథకాన్ని ప్రవేశపెట్టిన
కేంద్ర ప్రభుత్వం


