22న మెగా జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

22న మెగా జాబ్‌మేళా

Mar 15 2026 5:02 AM | Updated on Mar 15 2026 5:02 AM

22న మెగా జాబ్‌మేళా చోరీ కేసులో నిందితుడి అరెస్టు నితిన్‌ నబీన్‌తో సాయిరెడ్డి

కామారెడ్డి టౌన్‌: కామారెడ్డిలో ఈనెల 22న జీ సీఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో భారీ ఉ పాధి మేళా నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌ రెడ్డి తెలిపా రు. జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని పార్శి రాములు కల్యాణ మండపం వేదికగా ఈ మేళా నిర్వహించనున్న ట్లు, 50కి పైగా ప్రముఖ కంపెనీలతో సుమారు 2వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వనున్న ట్లు వివరించారు. ఎస్సెస్సీ నుంచి పీజీ వరకు పూర్తి చేసిన అభ్యర్థులకు వారి విద్యార్హతలను బట్టి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కౌన్సిలర్‌ మహేష్‌, మాజీ కౌన్సిలర్లు పంపరి శ్రీనివాస్‌, జూలూరి సుధాకర్‌, నాయకులు రంగ రమేష్‌గౌడ్‌, సబ్బని హరికృష్ణ, గంగారాములు, బండారి శ్రీకాంత్‌, బల్ల శ్రీనివాస్‌, రాజశేఖర్‌, సునీల్‌, అరుణ్‌ పాల్గొన్నారు.

బాన్సువాడ రూరల్‌: మండల కేంద్రంలోని ప్రెస్‌కాలనీలో నివాసముండే పట్లోళ్ల సుగుణ ఇంట్లో గతేడాది ఆగస్టు 5న చోరీకి పాల్పడిన నిందితుడిని శనివారం పోలీసులు పట్టుకున్నారు. సుగుణ తన ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌ వెళ్లి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టబడి ఉన్నాయి. ఇంట్లో దాచిన రూ.రెండున్నల లక్షలు అపహరణకు గురికావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఆరు నెలల తర్వాత నిందితుడు దండుగల ఎల్లప్ప తాడ్కోల్‌ శివాజీ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు విచారించారు. ప్రెస్‌కాలనీలో చోరీకి పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని, అతని వద్ద నుంచి రూ.45వేల విలువ చేసే ట్యాబ్‌ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామని సీఐ తుల శ్రీధర్‌ తెలిపారు.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ క్షేత్రాల అఖిల భారతీయ సమన్వయ సదస్సు హర్యానాలో జరుగుతోంది. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో సంఘ్‌ అన్ని శాఖలకు చెందిన అఖిల భారత అధ్యక్ష, కార్యదర్శులు మాత్రమే పాల్గొంటున్నారు. ఇందులో ఇందూరు నగరానికి చెందిన అఖిల భారత కిసాన్‌ సంఘ్‌ జాతీయ అధ్యక్షులు కొండెల సాయిరెడ్డి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ కలిసి ఒకే వరుసలో పాల్గొన్నారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అఖిల భారత అధ్యక్ష స్థాయికి ఎదిగిన అత్యంత సాధారణ కార్యకర్తలు ఇద్దరు కలిసిన అరుదైన దృశ్యం జిల్లా సంఘ్‌ శ్రేణుల్లో సంతోషం నింపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement