సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జి ల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్షుడిగా ఏలె మల్లికార్జున్ నియమితులయ్యారు. ఈ మే రకు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశా రు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఏలె మల్లికా ర్జున్ జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నారు. ఆయన గ తంలో వైస్ ఎంపీపీగా పనిచేశారు. డీసీసీ అధ్యక్ష ప దవి కోసం ప్రస్తుత అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావ్ తో పాటు మరికొందరు ప్రయత్నించారు. పాతవారికి కాకుండా కొత్తవారికి అవకాశం ఇవ్వాలని భా వించిన పార్టీ.. ఏలె మల్లికార్జున్‌ను డీసీసీ అధ్యక్షుడిగా నియమించింది.
నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నగేశ్‌రెడ్డి
నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా న గేశ్‌రెడ్డి నియమితులయ్యారు. ఆయన నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా, పీసీసీ కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగానూ వ్యవహరించారు.


