‘క్రీడల్లోనూ సత్తా చాటాలి’
కామారెడ్డి టౌన్: జిల్లా విద్యార్థులు, క్రీడాకారులు క్రీడల్లో రాణించి జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని డీఈవో రాజు సూచించారు. శనివారం జిల్లాకేంద్రంలోని సరస్వతి శిశుమందిర్ మైదానంలో క్రీడాభారతి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించే క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. అండర్–14, 17 విభాగాల్లో కబడ్డీ, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ తదితర పోటీలను నిర్వహించారు. జిల్లాలోని ఆయా పాఠశాలల క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో క్రీడా భారతి జిల్లా అధ్యక్షుడు కొమిరెడ్డి మారుతి, కార్యదర్శి అంకుష్, ప్రతినిధులు వెంకటేశ్వర్ గౌడ్, జైపాల్ రెడ్డి, అనిల్, దత్తు, సాయినాథ్, జంగం నరేష్ పాల్గొన్నారు.
‘క్రీడల్లోనూ సత్తా చాటాలి’


