నేడు వాలీబాల్‌ టోర్నీ | - | Sakshi
Sakshi News home page

నేడు వాలీబాల్‌ టోర్నీ

Nov 23 2025 6:01 AM | Updated on Nov 23 2025 6:01 AM

నేడు

నేడు వాలీబాల్‌ టోర్నీ

తాడ్వాయి: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థాయి అండర్‌ –18 వాలీబాల్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని వాలీబాల్‌ అసోసియేషన్‌ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రవి, కార్యదర్శి బాలు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు టెన్త్‌ క్లాస్‌ మెమో, ఆధార్‌ కార్డు, ఒరిజనల్‌ బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ వెంటతీసుకుని ఉదయం 9 గంటలలోపు తాడ్వాయి పాఠశాలలో రిపోర్టు చేయాలని సూచించారు. ఇందులో ప్రతిభ చూపిన వారిని ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామని తెలిపారు. ఈనెల 29 నుంచి సిరిసిల్లలో జరిగే రాష్ట్రస్థాయి టోర్నీలో ఉమ్మడి జిల్లా జట్టు పాల్గొంటుందని పేర్కొన్నారు.

టీసీసీ పరీక్షలకు

దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి టౌన్‌: టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు (టీసీసీ) పరీక్షలకు సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో ఎస్‌.రాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి కోర్సుల పరీక్ష ఫీజు, తేదీలను ప్రభుత్వం ప్ర కటించిందని పేర్కొన్నారు. డ్రాయింగ్‌ లోయర్‌ గ్రేడ్‌ పరీక్ష ఫీజు రూ.100, హయ్యర్‌ గ్రేడ్‌ రూ.150, టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ లోయర్‌ గ్రేడ్‌ రూ.150, హయ్యర్‌ గ్రేడ్‌ రూ.200 ఫీజులను ఎలాంటి ఫైన్‌ లేకుండా డిసెంబర్‌ 5 లోపు చెల్లించాలని తెలిపారు. రూ. 50 ఫైన్‌తో డిసెంబర్‌ 12లోపు, రూ.75 ఫైన్‌తో డిసెంబర్‌ 19వ తేదీ వరకు గడువుందని పేర్కొన్నారు. లోయర్‌ గ్రేడ్‌ పరీక్షకు ఏడో తరగతి, హయ్యర్‌ గ్రేడ్‌కు లోయర్‌ గ్రేడ్‌ పరీక్ష ఉత్తీర్ణులైన వారు అర్హులని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే అభ్యర్థులు ధ్రువపత్రాలను డిసెంబర్‌ 20లోపు డీఈవో కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.

వందేమాతరం

మహోన్నతమైన గీతం

నిజాంసాగర్‌(జుక్కల్‌): నూట యాభై ఏళ్ల చరిత్ర కలిగిన వందేమాతరం గీతం మహోన్నతమైనదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు పేర్కొన్నారు. శనివారం మహమ్మద్‌ నగర్‌ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో వందేమాతరం గీతం 150 సంవత్సరాల ఉత్సవాలను నిర్వహించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా చిన్నరాజులు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్లాది మంది భారతీయులకు వందేమాతరం గీతం స్ఫూర్తినిచ్చిందన్నారు. వందేమాతరం రచించి 150 ఏళ్లు అయిన సందర్భంగా ఈ గీతం చారిత్రక నేపథ్యాన్ని తెలిపేందుకు దేశవ్యాప్తంగా పండుగలా జరుపుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అరుణతార, నేతలు కొండ అనిల్‌గుప్తా, శ్రీకాంత్‌, సతీష్‌, రాజు తదితరులున్నారు.

జీపీవోల ఆవిర్భావ సభకు తరలిరావాలి

కామారెడ్డి రూరల్‌: హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం గ్రామ పరిపాలన ఉద్యోగ అసోసియేషన్‌ నూతన ఆవిర్భావ సభ నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ చిరంజీవి ముదిరాజ్‌ తెలిపారు. శనివారం కామారెడ్డి లోని సంఘం కార్యాలయంలో ఆయన మా ట్లాడారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యోగులను ఏకం చేసి మహాశక్తిగా ఎదిగేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. మహాసభలను విజయవంతం చేయాలని జీపీవోలను కోరారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు దుబాషి మాణిక్యం, సూర జ్‌ కుమార్‌, సంజీవులు, అశోక్‌, భాస్కర్‌, రాజు, సాయిలు, బలరామ్‌ రవి, సంతోష్‌ రెడ్డి, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు

డిచ్‌పల్లి: తెయూ పరిధిలో డిగ్రీ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగాయని అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ శనివారం తెలిపారు. ఉమ్మడి జిల్లాపరిధిలోని 30 పరీక్ష కేంద్రాల్లో 11,767 మందికి 11,087 మంది విద్యార్థులు హాజ రు కాగా 676 మంది గైర్హాజరయ్యారని, నలుగురు డిబార్‌ అయినట్లు పేర్కొన్నారు. నిజామాబాద్‌లోని గిరిరాజ్‌ కళాశాలలో ఒకరు, మోర్తాడ్‌ డిగ్రీ కళాశాలలో ఇద్దరు, కామారెడ్డిలోని మంజీర డిగ్రీ కళాశాలలో ఒకరు డిబార్‌ అయినట్లు ఆయన తెలిపారు.

నేడు వాలీబాల్‌ టోర్నీ 
1
1/1

నేడు వాలీబాల్‌ టోర్నీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement