కార్తీక సామూహిక దీపోత్సవం
భిక్కనూరు: దక్షిణ కాశీగా పేరొందిన భిక్కనూరు సిద్ధరామేశ్వరాలయంలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో కార్తీక సామూహి దీపోత్సవాన్ని గురువారం రాత్రి నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదబ్రాహ్మణులు రామగిరిశర్మ కలెక్టర్‌తో స్వామివారికి అభిషేకం చేయించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కలెక్టర్ దీపాలను వెలిగించారు. ఆలయ ఈవో శ్రీధర్, పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ లింబాద్రి, వైస్ చైర్మన్ దయాకర్‌రెడ్డి, డైరెక్టర్లు చీకోటి ప్రభాకర్, నీల అంజయ్య, పూజారులు రాజేశ్వరశర్మ, సిద్ధేశ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కల్లూరి సిద్ధరాములు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి : జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ప్రతినెలా నాల్గో శనివారం ‘నో బ్యాగ్ డే’ను తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి రాజు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ‘నో బ్యాగ్‌డే నోచేదెప్పుడో’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి గురువారం ఆయన స్పందించారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ప్రతినెలా నాల్గవ శనివారం ‘నో బ్యాగ్‌డే’ను అమలు చేయాలన్నారు. ‘నో బ్యాగ్ డే’ రోజున విద్యార్థులతో ఆటలాడిస్తూ వారికి కథలు చెబుతూ ప్రాక్టికల్ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. మండల విద్యాధికారులు ప్రతినెలా నాల్గో శనివారం పాఠశాలలను పర్యవేక్షించాలని సూచించారు. ‘నో బ్యాగ్ డే’ మార్గదర్శకాలను పాటించని పాఠశాలలపై కఠిన చర్యలు ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి మాస్టర్స్ అథ్లెటి క్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 23న ఉ దయం 8గంటలకు స్థానిక ఇందిరాగాంధీ స్టే డియంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు ని ర్వహించనున్నట్టు అసోసియేషన్ జిల్లా అధ్య క్ష, ప్రధాన కార్యదర్శులు రంజిత్‌మోహన్, డి నరేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 30 నుంచి 90 ఏళ్ల వయస్సు వారు పోటీల్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. 100, 200, 400, 800, 1500, 10వేల మీటర్ల పరుగు, 5వే ల మీటర్ల నడక, లాంగ్‌జంప్, షాట్‌పుట్, డి స్కస్‌త్రో, జావెలిన్ త్రో అంశాల్లో పోటీలు ఉంటాయని వివరించారు. ఎంపికై న వారు రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
ఎల్లారెడ్డి : న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు పత్తి విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. పట్టణంలో గురువారం న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రానున్న బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని, న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేసే అవకాశం తనకు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు రాంచరణ్, గోపాలరావు, శ్రీనివాస్, శ్రీకాంత్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
కార్తీక సామూహిక దీపోత్సవం


