కాంటా అయినా.. కష్టాలే..
● లారీలు లేక తరలని ధాన్యం బస్తాలు
● 20 రోజులుగా రైతులకు ఇబ్బందులు
ఎల్లారెడ్డిరూరల్: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కాంటా చేయక.. కాంటా పూర్తయిన బస్తాలను తరలించక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కోత సమయంలో భారీ వర్షాలు కురవడంతో ఇబ్బందులు పడ్డామని, తరువాత కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిందని అన్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబోసి నిర్దిష్ట తేమ శాతం వచ్చేంత వరకు ఇబ్బందులు పడ్డామంటున్నారు. తేమ శాతం 17 వచ్చిన తరువాత దానిని కాంటా చేసేందుకు 15 రోజులు పట్టగా, కాంటా చేసిన ధాన్యం రవాణాకు రెండు, మూడు రోజుల సమయం పడుతోందని, పంట కోత నుంచి ధాన్యం కాంటా పూర్తయినా ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. మండలంలోని అన్నాసాగర్, కళ్యాణి గ్రామాల కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం బస్తాలు వెంటవెంటనే తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
కాంటా అయినా.. కష్టాలే..


