విధిలేక..
కామారెడ్డి అర్బన్ : జిల్లాకేంద్రంలోని జీఆర్ కాలనీ, హౌసింగ్‌బోర్డు కౌండిన్య కాలనీల్లో శనివారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో భోజనా లు ఏర్పాటు చేశారు. ఈ కాలనీలో పలువు రు శనివారం ఉపవాసం ఉంటారు. అయితే వరదల కారణంగా కట్టుబట్టలతో మిగిలినవారు.. రెండు రోజులుగా సరైన తిండిలేక ఇబ్బంది పడుతున్నవారు విధిలేని పరిస్థితిలో ఉపవాసం ఉండలేకపోయారు. దీంతో పలువురు తమ పరిస్థితిని తలచుకుని రోదిస్తూ భోజనం చేశారు. సేవా కార్యక్రమాల్లో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ జైపాల్‌రెడ్డి, ప్రతినిధులు శంకర్, కృష్ణహరి, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.


