
డీజే నిర్వాహకుల బైండోవర్
గాంధారి(ఎల్లారెడ్డి): వినాయక నవరాత్రుల సందర్భంగా వినాయక మండపాల వద్ద డీజేలను పూర్తిగా నిషేధించామని, డీజేలకు ఎలాంటి అనుమతి లేదని ఎస్సై ఆంజనేయులు అన్నారు. సోమవారం డీజే యజమానులు, డీజేల నిర్వాహకులను తహసీల్దార్ రేణుకా చౌహాన్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై తెలిపారు. ఎవరైనా వినాయక మండపాల వద్ద డీజేలు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
బాన్సువాడ రూరల్: నానోయూరియా స్ప్రే రైతులకు ఎంతో లాభదాయకమని కోనాపూర్ క్లస్టర్ ఏఈవో జ్ఞానేశ్వర్ అన్నారు. సోమవారం ఆయన బోర్లం సొసైటీ చైర్మన్ సంగ్రాం నాయక్‌తో కలిసి హన్మాజీపేట్, సంగ్రాంతండాల్లో వరి పొలాలను పరిశీలించారు. రైతులకు నానోయూరియా ప్రాముఖ్యత గురించి వివరించారు. అరలీటర్ నానోయూరియా ఒక బస్తా యూరియాతో సమానమన్నారు. పర్యావరణ హితమైన నానో యూరియా స్ప్రే చేయడం వల్ల వరి మొక్క త్వరగా నత్రజనిని గ్రహించుకుంటుందన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో ఆకుముడత పురుగు ఉధృతి ఉందన్నారు. పురుగు నివారణకు కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్పీ లేదంటే క్లోరాంట్రానిపోల్ 0.25 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. అలాగే దేశాయిపేట్ క్లస్టర్ ఏఈవో దత్తేశ్వరి.. గ్రామంలోని పంటపొలాల్లో రైతులతో కలిసి పర్యటించారు. గాలిలో తేమశాతం వల్ల బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించాయన్నారు. దీని నివారణకు 15 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలన్నారు. ప్లాంటామైసిన్ 20 గ్రాములతో పాటు కాపర్ హైడ్రాకై ్సడ్ 600 గ్రాములు కలిపి పిచికారీ చేస్తే తెగుళ్ల ఉధృతి తగ్గుముఖం పడుతుందన్నారు.

డీజే నిర్వాహకుల బైండోవర్