
గురుకుల పాఠశాల పరిశీలన
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను ఆర్డీవో పార్థసింహారెడ్డి సోమవారం పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపల్ నాగేశ్వర్‌రావు, ఉపాధ్యాయులు తదితరులున్నారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని ఎండ్రియాల్, చందాపూర్ శివారులో పంటలను సోమవారం మండల వ్యవసాయ అధికారి నర్సింలు పరిశీలించారు. ఖరీఫ్‌లో వేసిన సోయా, పత్తి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పలుసూచనలు చేశారు.
కామారెడ్డి అర్బన్: మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు గాదం సత్యనారాయణ లింగంపేట మండలం మోతె ప్రాథమిక మత్స్యకారుల సంఘంలోని ఆయన ప్రాథమిక సభ్యత్వం తొలగించారు. జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారాయణ నివాసంపై ఆరోపణలు రావడంతో జిల్లా పంచాయతీ అధికారి ద్వారా విచారణ జరిపి రేషన్ కార్డు, ఆధార్, ఓటర్ గుర్తింపు, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలను పరిగణనలోకి తీసుకుని నివాస స్థితిని ధ్రువీకరించినట్టు మత్స్యశాఖ జిల్లా అధికారి పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం సొసైటీ పరిధిలోని గ్రామాల్లో నివసించే వారికే సభ్యత్వం ఉంటుందన్నారు. మోతెలో నివాసించనందున సొసైటీలో సభ్యత్వం రద్దు చేసినట్టు వివరించారు.
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండల మున్నూరుకాపు సంఘం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా సోమవారం ఎన్నుకున్నట్లు కార్యవర్గ సభ్యులు తెలిపారు. మండల అధ్యక్షుడిగా గాదె తిరుపతి, ఉపాధ్యక్షులుగా పేశెట్టి లక్ష్మీనారాయణ, కిష్టయ్య, ప్రధాన కార్యదర్శిగా మల్లేశం, సహాయ కార్యదర్శులుగా లక్ష్మణ్, రవి, దేవేందర్, రాజు, రాములు, కోశాధికారిగా మైదపు శ్రీనివాస్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు తెలిపారు.

గురుకుల పాఠశాల పరిశీలన

గురుకుల పాఠశాల పరిశీలన