
‘ఓపెన్ యూనివర్సిటీలో నైపుణ్య ఉపకార ఆధారిత విద్య’
కామారెడ్డి అర్బన్ : అంబేడ్కర్ ఓపెన్ యూ నివర్సిటీలో నైపుణ్య ఉపకార వేతన ఆధారి త విద్యను అందించనున్నట్లు యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ రాజేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం కామారెడ్డి అధ్యయన కేంద్రంలో నైపుణ్య ఉపకార వేతన ఆధారిత విద్య ప్రచార పోస్టర్లను ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్యతో కలిసి ఆవిష్కరించారు. రామానందతీర్థ సంస్థతో అవగాహన ఒప్పందంతో ఓపెన్ విద్యతో పాటు వివిధ ఉపాధి సర్టిఫికెట్ కోర్సులు ప్రవేశపెట్టినట్లు జేడీ తెలిపారు. మహిళా సాధికారతకు వీ హబ్‌తో ఒప్పందం చేసుకున్నామని, రిటైల్ అసోసియేషన్స్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆర్‌ఏఎస్‌సీఐ) సహకారంతో ఉపకార వేతన ఆధారిత విద్య అందించనున్నామని పేర్కొన్నారు. గిరిజన తెగలు, దివ్యాంగులకు ఉచిత విద్య అందస్తున్నామన్నారు. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 30 వరకు అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ సునీల్‌కుమార్, అధ్యాపకులు రాజ్‌గంభీర్‌రావు, చంద్రశేఖర్, శ్రీనివాస్, కార్యాలయ బాధ్యుడు బాపురావు తదితరులు పాల్గొన్నారు.
‘పాత కేసులు ఎత్తేస్తాం’
రాజంపేట : మండల కేంద్రంలో ఈ ఏడాది వినాయక ఉత్సవాలను శాంతియుతంగా ని ర్వహిస్తే గతంలో యువకులపై ఉన్న కేసుల ను ఎత్తేస్తామని ఏఎస్పీ చైతన్యరెడ్డి పేర్కొన్నారు. రాజంపేటలోని శ్రీలక్ష్మీనరసింహ గా ర్డెన్‌లో మండపాల నిర్వాహకులతో సమావే శం నిర్వహించారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మండపాల ఏర్పాటులో పా టించాల్సిన నియమ నిబంధనలను గురించి వివరించారు. మూడేళ్లుగా ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకుంటున్న గ్రామస్తులను సీఐ సంపత్ అభినందించారు. వి ద్యుత్ లైన్ల కింద, ట్రాన్స్‌ఫార్మర్‌ల వద్ద వినా యక మండపాలను ఏర్పాటు చేయవద్దని ఏఈ నాందేవ్ సూచించారు. కార్యక్రమంలో గ్రామాల మండపాల నిర్వాహకులు, పంచా యతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
‘యంత్ర పరికరాలకు దరఖాస్తుల ఆహ్వానం’
కామారెడ్డి క్రైం : జిల్లాకు సబ్ మిషన్ ఆన్ అ గ్రికల్చర్ మెకానైజేషన్–2025 పథకంలో భా గంగా పలు యంత్రాలు మంజూరయ్యా యని డీఏవో మోహన్‌రెడ్డి తెలిపారు. 4,041 బ్యాటరీ ఫుట్ మాన్యువల్లీ ఆపరేటెడ్ పవర్ స్ప్రేయర్‌లు, 606 పవర్ ఆపరేటెడ్ స్ప్రేయర్‌లు, 260 రొటోవేటర్‌లు, 64 సీడ్ కం ఫెర్టిలైజర్ డ్రిల్‌లు, 286 డిస్క్ హారో కల్టివేటర్ ఎంబీ ప్లాప్ కేజ్‌వీల్స్, రొటోపడ్లర్‌లు, 15 బండ్ ఫార్మర్‌లు మంజూరయ్యాయన్నారు. వీటిని చిన్న, సన్నకారు మహిళా రైతులు, ఎ స్సీ ఎస్టీ రైతులకు 50 శాతం సబ్సిడీపై, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీపైన అందిస్తామని తెలిపారు. ఆసక్తి గల రైతులు ఆరో తేదీలోగా స్థానిక రైతు వేదికలలోగానీ, మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో గానీ దరఖాస్తులను అందించాలన్నారు.
‘తండాల అభివృద్ధికి కృషి’
కామారెడ్డి టౌన్ : తండాల అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్, లంబాడా హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు బెల్లయ్య నాయక్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్ కాలనీలో నిర్వహించిన సమితి జిల్లా స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సీఎంతో చర్చించి పోడు భూములకు పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. లంబాడీల గోర్ బోలిని భాషను రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. గిరిజనుల హక్కులు, డిమాండ్ల పరిష్కారం కోసం సెప్టెంబర్‌లో జుక్కల్ నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాణాప్రతాప్, రాష్ట్ర కార్యదర్శి వినోద్, జిల్లా అధ్యక్షుడు గణే ష్ నాయక్, ప్రధాన కార్యదర్శి బద్రునాయక్, నాయకులు శ్రవణ్, లక్ష్మణ్, వినోద్, గణపతి, మదన్‌లాల్, రూప్‌సింగ్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

‘ఓపెన్ యూనివర్సిటీలో నైపుణ్య ఉపకార ఆధారిత విద్య’

‘ఓపెన్ యూనివర్సిటీలో నైపుణ్య ఉపకార ఆధారిత విద్య’