
విద్యుదాఘాతంతో యువ రైతు మృతి
నస్రుల్లాబాద్ : మండలంలోని నెమ్లి గ్రామ శివారులో ఉన్న పంట పొలాల్లో విద్యుదాఘాతంతో యువ రైతు మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. గ్రా మస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బొబ్బిలి శ్రీనివాస్(39) నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎక్స్–రే టెక్నీషియన్ గా పనిచేస్తాడు. భార్య ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా ఉద్యోగం చేస్తుంది. శ్రీనివాస్ సోమవారం ఉద యం పొలానికి పురుగు మందు పిచికారీ చేసేందు కు వెళ్లాడు. ఉదయం వెళ్లిన వ్యక్తి మధ్యాహ్నం వర కు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు పొలానికి వెళ్లి చూడగా పంట కాలువలో విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే గ్రామస్తులు, పోలీసులకు సమాచారం అందించారు. పొలానికి స్ప్రే చేయడానికి మందులు తీసుకొని వచ్చి, బోరు ఆగిపోయి ఉండటంతో శ్రీనివాస్ స్టార్టర్ బాక్సులోని మూడు ఫ్యూజులలో ఒక ఫ్యూజు మాత్రమే తీసి బోరును ముట్టుకుని ఉన్నాడు. బోరు మోటారు నుంచి విద్యుత్ సరఫరా కావడం, పంట కాలువలో నీరు ఉండటంతో షాక్ తగిలి అక్కడిక్కడే షాక్ మృతి చెందాడన్నారు. ఘటనా స్థలాన్ని ఎస్సై రాఘవేంద్ర పరిశీలించి మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య రమ్య, కూతురు పర్ణిత, కొడుకు రియాంత్ ఉన్నారు.
నాన్నా... అంటూ చిన్నారి ఏడుపు
పొలాల మధ్య నుంచి శ్రీనివాస్ మృతదేహాన్ని రోడ్డుపైకి స్థానికులు తీసుకుని వచ్చారు. అప్పుడే పాఠశాల నుంచి వచ్చిన కూతురు పర్ణిత నాన్నా అంటూ ఒక్కసారిగా ఏడవడంతో స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు.

విద్యుదాఘాతంతో యువ రైతు మృతి