
మొబైల్ ఫోరెన్సిక్‌తో మెరుగైన సేవలు
కామారెడ్డి క్రైం: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక పరికరాలతో రూపొందించిన మొబైల్ ఫోరెన్సిక్ వాహనం జిల్లా పోలీసులకు మరింత మెరుగైన సేవలు అందించగలదని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. ఫోరెన్సిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ విభాగం కామారెడ్డి జిల్లాకు నూతనంగా మంజూరు చేసిన మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని గురువారం జిల్లా పోలీసు కార్యాయలం వద్ద ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నేరాలు జరిగిన ప్రదేశాల్లో సాక్ష్యాధారాలను సేకరించి నిందితులను గుర్తించడంలో ఫోరెన్సిక్ విభాగం పాత్ర ఎంతో కీలకమన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు, పలువురు సీఐలు, ఎస్సైలు, క్లూస్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.
● ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కొత్తగా ఏర్పాటైన మహమ్మద్‌నగర్ రెవెన్యూ మండలానికి 13 పోస్టులు మంజూరయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్‌తోపాటు ఇద్దరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, సర్వేయర్, చైన్‌మెన్, ముగ్గురు అటెండర్ పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మండల రెవెన్యూ కార్యాలయానికి సరిపడా పోస్టులు మంజూరు కావడంతో పోస్టింగులు ఇవ్వడానికి మార్గం సుగమమైంది. ఇంతకా లం డిప్యుటేషన్‌పై ఉన్న ఒకరిద్దరు అధికారు లు, సిబ్బందిని నెట్టుకువచ్చారు. పోస్టులు మంజూరవడంతో రెగ్యులర్ అఽధికారులు, సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది.
భిక్కనూరు: పాఠశాలల్లో లైబ్రరీ పీరియడ్‌ను తప్పనిసరిగా నిర్వహించి విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంపొందించాలని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి టి.వేణుగోపాల్ అన్నారు. గురువారం భిక్కనూరు రైల్వే స్టేషన్ ప్రాథమిక పాఠశాలతోపాటు ఇతర పాఠశాలలను వేణుగోపాల్ తనిఖీ చేశారు. పాఠశాలల్లో ఎఫ్‌ఎల్‌ఎన్ అమలు, రిజిస్టర్ల నిర్వహణను పరిశీలించారు. విద్యార్థులతో వర్క్ షీట్ల ద్వారా ఎప్పటికప్పుడు సాధన చేయిస్తూ పాఠ్య పుస్తకం, పాఠ్య ప్రణాళిక, వర్క్ బుక్‌ల మధ్య అలైన్‌మెంట్ పాటించాలని సూచించారు.
ఖలీల్‌వాడి: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జూలైలో 1708 డ్రంకన్‌డ్రైవ్ కేసులు నమోదైనట్లు సీపీ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. 1708 మందిలో 966 మందిపై అభియోగాలు మోపుతూ చార్జిషీట్ లు కోర్టులో వేయగా వారు నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు. 77 మందికి జైలు శిక్ష, మి గతా కేసుల్లో జరిమానాలు విధించినట్లు తెలిపారు. తమ అభ్యర్థన మేరకు ఆర్టీఏ అధికారులు జూలై నెలలో 62 డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేసినట్లు సీపీ తెలిపారు.

మొబైల్ ఫోరెన్సిక్‌తో మెరుగైన సేవలు