
మత్తు పదార్థాలను అరికట్టాలి
కామారెడ్డి క్రైం: మత్తు పదార్ధాలను అరికట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన మాదక ద్రవ్యాల నిర్మూలన కమిటీ సమావేశంలో మాట్లాడారు. అన్ని పాఠశాలలు, కళాశాలల్లో కార్యక్రమాలను ఏర్పాటు చేసి విద్యార్ధులు, యువతకు మత్తు పదార్ధాల వాడకం ద్వారా కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించాలన్నారు. నిషేధిత మత్తు పదార్థాల సరఫరాపై పోలీసు, ఎకై ్సజ్ శాఖలు నిఘా పెట్టాలన్నారు. గంజాయి, మద్యానికి బానిసలైన వ్యక్తులకు కౌన్సెలింగ్ చేపట్టి వారిని సాధారణ స్థితికి తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేశ్‌చంద్ర మాట్లాడుతూ.. సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నివారణపై మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కట్టడికి పోలీసు శాఖ ఆధ్వర్యంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.