
సమన్వయంతో పనిచేయాలి
● గణేశ్ ఉత్సవాలను ప్రశాంత
వాతావరణంలో నిర్వహించాలి
● శాంతి కమిటీ సమావేశంలో
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: జిల్లాలో వినాయక ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు, అన్ని మతాల పెద్దలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. జిల్లా స్థాయి శాంతి కమిటీ సమావేశాన్ని గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వినాయక ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని సిద్ధంగా ఉందన్నా రు. ప్రజలందరూ సోదర భావంతో మెలగాలన్నా రు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు చోటు లేకుండా ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. మండపం ఏర్పాటు చేసే ప్రాంతానికి అనువైన పరిమాణంలో ఉన్న వినాయక ప్రతిమలను తీసుకురావాలని నిర్వాహకులకు సూచించారు. ప్రజలు ఇ బ్బందులకు గురి కాకుండా చూడాలన్నారు. ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ముందస్తు అనుమతులు తప్పనిసరి అని, నిబంధనలకు లోబ డి లౌడ్ స్పీకర్లను వినియోగించాలన్నారు. నిమజ్జన సమయంలో తగిన జాగ్ర త్తలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాల ను సక్రమంగా నిర్వహించాలని, రోడ్లు, విద్యుత్ తీ గల మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డివిజన్, మండల స్థాయిలలో శాంతి కమిటీలను ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఎస్పీ రాజేశ్‌చంద్ర, ఏఎస్పీ నరసింహారెడ్డి, అదన పు కలెక్టర్ చందర్, ఏ ఎస్పీ చైతన్యరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.