
నిజాంసాగర్‌కు తగ్గిన వరద
● ఇన్‌ఫ్లో 52,477..
అవుట్ ఫ్లో 37,291 క్యూసెక్కులు
నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. గురువారం సాయంత్రానికి 52,477 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. 9 గేట్ల ద్వారా 37,291 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు(17.8 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1402.58 అడుగుల (14.438 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.
కౌలాస్‌లోకి 1,403 క్యూసెక్కులు..
జుక్కల్ మండలంలోని కౌలాస్ ప్రాజెక్టులోకి 1,403 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు (1.237 టీఎంసీలు)గాను ప్రస్తుతం 457.60 మీటర్లు (1.141 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ఒక గేటు ద్వారా 648 క్యూసెక్కుల నీటిని మంజీరలోకి విడుదల చేస్తున్నారు.
కల్యాణిలోకి 200 క్యూసెక్కులు..
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రామ శివారులో ఉన్న కల్యాణి ప్రాజెకులోకి 200 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు గురువారం తెలిపారు. కల్యాణి వాగు ద్వారా ప్రాజెక్టులోకి 200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరిందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 409.50 అడుగులకు గాను 408.30 అడుగుల నీటిని నిలువ ఉంచుతూ 100 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ మెయిన్ కెనాల్‌కు డైవర్షన్ చేయగా 100 క్యూసెక్కుల నీటిని ఒక వరద గేటు ఎత్తి నీటిని మంజీరాలోకి వదిలినట్లు అధికారులు తెలిపారు.