
‘బాధ్యతగా పని చేయాలి’
బాన్సువాడ : ఆర్టీసీ ఆదాయాన్ని పెంచే మా ర్గాలను అన్వేషించాలని ఆర్టీసీ ఈడీ సోలో మన్ సూచించారు. బుధవారం బాన్సువాడ డిపోను ఆయన సందర్శించి, సిబ్బంది, కార్మికులతో మాట్లాడారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పని చేయాలని, ఖర్చులు తగ్గిస్తూనే ఆదాయ మార్గాల ను అన్వేషించాలని సూచించారు. ఇందుకో సం కార్మికులు, సిబ్బంది బాధ్యతతో పనిచేయాలన్నారు. అనంతరం డిపో ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ జ్యోత్స్న, డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్, బాన్సువాడ డిపో మేనేజర్ సరితాదేవి తదితరులు పాల్గొన్నారు.
● ఒక్కో స్కూల్ నుంచి రూ. ఐదొందలు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ గ్రాంట్ల ద్వారా వచ్చే నిధుల వినియోగంపై నిర్వహించే ఆడిటింగ్‌కోసం వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆడిట్ చేయడానికి వచ్చే సిబ్బంది కోసమంటూ ప్రతి పాఠశాల నుంచి రూ.5 వందల చొప్పున మధ్యవర్తులు వసూళ్లు చేస్తున్నట్లు తెలిసింది. స్కూళ్లపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, చివరికి ఆడిటింగ్‌కు కూడా డబ్బులు వసూలు చేస్తున్న వ్యవహారంపై ఉపాధ్యాయులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ కాంప్లెక్సుల వారీగా డబ్బులు వసూలు చేసి ఆడిటింగ్ సిబ్బందికి ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి ఇలాంటి వాటిని నిలువరించాల్సిన అవసరం ఉంది.
దోమకొండ: ప్రతి ఒక్కరు అంబేడ్కర్ ఆశయాలను సాధించే దిశగా కృషిచేయాలని స్వేరోస్ ఫౌండర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. గురువారం దోమకొండలో స్వేరోస్ నెట్‌వర్క్ వైస్‌చైర్మన్ దేవరగట్టు బాలప్రసాద్ తల్లి సంతాప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. బడుగు బలహీన వ ర్గాల అభ్యున్నతితో దేశం ముందంజ వేస్తుందన్నారు. కార్యక్రమంలో స్వేరోస్ చైర్మన్ మామిడాల ప్రవీణ్‌కుమార్, ప్రతినిధులు దుర్గయ్య, బాల్‌రాజు, లక్ష్మణ్, రాజ్‌కుమార్, రాజు, రాములు, రవీందర, పాత రాము, మురళి తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి క్రైం: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి పనుల జాతరకు శ్రీకారం చుట్టింది. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది రూ. 2,523.17 కోట్లతో 3,347 పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేర కు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింద ని డీఆర్‌డీవో సురేందర్ తెలిపారు. పంచాయతీ, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, ప్లాస్టి క్ వేస్టేజ్ యూనిట్‌ల ఏర్పాటు, రహదారుల నిర్మాణం, కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్‌ల ని ర్మాణం, మహిళా సంఘాలకు పశువుల కొట్టా లు, కోళ్లు, గొర్రెల షెడ్లు, బావుల తవ్వకం, వానపాముల ఎరువుల తయారీ, అజోల్లా పిట్‌లు, పండ్ల తోటల పెంపకంలాంటి పను లు చేపట్టనున్నామన్నారు. ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో రేపటి నుంచి పనుల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

‘బాధ్యతగా పని చేయాలి’