
ట్రాన్స్ ‘ఫార్మర్ల’ కష్టాలు
సదాశివనగర్ (ఎల్లారెడ్డి): ఆరుగాలం కష్టించి సాగుచేసిన పంట చేతికి వచ్చేదాకా నమ్మకం లేకుండా పోతోతోంది. ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు వాతావరణం అనుకూలించడం లేదు. దీంతో సకాలంలో వర్షాలు కురువకపోవడం వల్ల రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. అప్పులు చేసి వరి సాగు చేస్తున్న రైతులు ఆకాశం వైపు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు వ్యవసాయ బావుల వద్ద ఉన్న బోర్ల మీద ఆశలు పెట్టుకున్న రైతులు పడుతున్న కష్టాలు వర్ణతీతం. వ్యవసాయ బావుల వద్ద ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌లు తరచూ కాలిపోతున్నాయి.ట్రాన్స్‌కో అధికారులు కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లకు సకాలంలో మరమ్మతులు చేయకపోవడం వల్ల సాగు చేసిన వరి పొలాలు బీటలు వారుతున్నాయి. త్వరగా మరమ్మతులు చేపడితే తమ పంటలు ఎండిపోయే పరిస్థితి ఉండదని రైతులు అంటున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ట్రాన్స్‌కో అధికారులు స్పందించి కాలిపోతున్న ట్రాన్‌ఫార్మర్లకు వెంటనే మరమ్మతులు చేయించాలని రైతులు కోరుతున్నారు.
● 15 రోజులు గడిచినా మరమ్మతులకు నోచుకోని కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు
● కరెంటు లేక ఎండుతున్న పొలాలు
● ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు
అధికారులు పట్టించుకోవడం లేదు
15 రోజుల క్రితం ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయినా అధికారులు పట్టించుకోకపోవడం వల్ల పంటలు ఎండుతున్నాయి. అధికారులు పట్టించుకుని ఉంటే తమ పొలాలు ఏండేవి కావు. ఎండిన పంటల వైపు చూస్తే మా బాధలు అర్థమయ్యేవి.
– మల్లయ్య, సదాశివనగర్ రైతు

ట్రాన్స్ ‘ఫార్మర్ల’ కష్టాలు

ట్రాన్స్ ‘ఫార్మర్ల’ కష్టాలు