
‘తల్లిపాలతో శిశువుకు రోగనిరోధక శక్తి లభిస్తుంది’
కామారెడ్డి టౌన్: తల్లిపాలతోనే శిశువుకు రోగ నిరోధక శక్తి లభిస్తుందని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ పెరుగు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా మంగళవారం జీజీహెచ్‌లో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పుట్టిన వెంటనే శిశువుకు తల్లి ముర్రు పాలు పట్టించాలన్నారు. క్రమం తప్పకుండా బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ వాల్యా పేర్కొన్నారు. అనంతరం ఆస్పత్రిలో రెండు మదర్ ఫీడింగ్ గదులను ప్రారంభించారు. తల్లిపాల ప్రాముఖ్యతకు సంబంధించిన వాల్ పోస్టర్లు, స్టిక్కర్లను ఆవిష్కరించి, తల్లి పాలనే తాగించాలని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పిల్లల విభాగాధిపతి శ్రీనివాస్ కళ్యాణి, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
‘విద్యాభివృద్ధికి
కృషి చేయాలి’
కామారెడ్డి టౌన్: విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని డీఈవో రాజు సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్సీవాడలోగల ప్రభుత్వ ఉన్నత, బాలికల పాఠశాలలకు ఐడీబీఐ బ్యాంక్ కామారెడ్డి శాఖ సీఎస్‌ఆర్ నిధులతో డెస్క్ బెంచీలు, కంప్యూటర్లు, ఫ్యాన్‌లను అందజేసింది. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ విద్యార్థులు చదువుల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో ఎల్లయ్య, ఐడీబీఐ హైదరాబాద్ రిజినల్ హెడ్ వెంకటేశ్, బ్యాంక్ ఏజీఎం శ్రీధర్, కామారెడ్డి మేనేజర్ రాజు, అసిస్టెంట్ మేనేజర్ ప్రవీణ్, ప్రధానోపాధ్యాయులు రవీందర్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ముగ్గురు జిల్లా
అధికారుల బదిలీ
కామారెడ్డి అర్బన్: జిల్లాలోని ముగ్గురు జిల్లా అధికారులు హైదరబాద్‌కు బదిలీ అయ్యారు. జిల్లా కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎం.కోటేశ్వర్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ లేబర్ కమిషనర్‌గా ప్రమోషన్‌పై వెళ్లారు. జిల్లా యువజన క్రీడల అధికారి జగన్నాథం హైదరాబాద్ సెట్విన్ పరిపాలన అధికారిగా బదిలీ అయ్యారు. పౌరసరఫరాల జిల్లా అధికారి రాజేందర్ పౌరసరఫరాల శాఖ రాష్ట్ర కార్యాలయానికి బదిలీ అయ్యారు. కాగా కామారెడ్డి కార్మికశాఖ అధికారిగా ఆర్మూర్ నుంచి ప్రభుదాస్, జిల్లా యువజన క్రీడల ఇన్‌చార్జి అధికారిగా వ్యాయామ ఉపాధ్యాయుడు ఆర్.వెంకటేశ్వర్‌గౌడ్‌ను నియమించారు. పౌరసరఫరాల జిల్లా అధికారిని ఎవరినీ నియమించలేదు. బదిలీ అయిన అధికారులను మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్లు చందర్, విక్టర్ సన్మానించి, వీడ్కోలు పలికారు.
‘అధికారుల సూచనలు పాటించాలి’
నిజాంసాగర్: పంటల సాగులో వ్యవసాయ అధికారులు ఇచ్చే సూచనలను రైతులు పాటించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన మహమ్మద్‌నగర్ మండలంలోని నర్వ, మహమ్మద్‌నగర్, కోమలంచ, తుంకిపల్లి గ్రామాల్లోని పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. అధికారుల సూచనల మేరకే పురుగుల మందులు పిచికారి చేయాలన్నారు. ఫర్టిలైజర్ షాప్‌లను సందర్శించి రికార్డులను పరిశీలించారు. చిట్టీ లేకుండా ఎవరికీ పురుగుల మందులు ఇవ్వవద్దని సూచించారు. ఆయన వెంట మండల వ్యవసాయశాఖ అధికారి నవ్య, ఏఈవోలు మధుసూదన్, రేణుక రైతులు ఉన్నారు.

‘తల్లిపాలతో శిశువుకు రోగనిరోధక శక్తి లభిస్తుంది’

‘తల్లిపాలతో శిశువుకు రోగనిరోధక శక్తి లభిస్తుంది’

‘తల్లిపాలతో శిశువుకు రోగనిరోధక శక్తి లభిస్తుంది’