బీఆర్‌ఎస్‌ను దెబ్బతీసే కుట్ర | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ను దెబ్బతీసే కుట్ర

Aug 6 2025 6:48 AM | Updated on Aug 6 2025 6:48 AM

బీఆర్‌ఎస్‌ను దెబ్బతీసే కుట్ర

బీఆర్‌ఎస్‌ను దెబ్బతీసే కుట్ర

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్టను, తద్వారా బీఆర్‌ఎస్‌ను దెబ్బతీయాలని రేవంత్‌రెడ్డి సర్కార్‌ చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు, కమిషన్‌ విచారణ తదితర అంశాలపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను కామారెడ్డిలోని గంప ఇంట్లో ఏర్పాటు చేసిన స్క్రీన్‌పై ఆ పార్టీ నేతలు వీక్షించారు. అనంతరం గంప మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును తక్కువ సమయంలో నిర్మించి దాని ఫలాలను రైతాంగానికి అందించిన కేసీఆర్‌, హరీశ్‌రావులను టార్గెట్‌ చేసి విచారణ పేరుతో కమిషన్‌లు ఏర్పాటు చేశారన్నారు. కాళేశ్వరంలో మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌, రంగనాయకసాగర్‌, మిడ్‌ మానేర్‌.. ఇలా ఎన్నో ప్రాజెక్టులు, బ్యారేజీలు, టన్నెల్స్‌, కాలువలు ఉన్నాయని పేర్కొన్నారు. ఒక్కచోట రెండు పిల్లర్లు కుంగితే కాళేశ్వరం కూలిందనే దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. దెబ్బతిన్న రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయకుండా అలాగే వదిలేసి రైతాంగానికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ను బద్నాం చేయాలని కాంగ్రెస్‌ చేసిన కుట్రలను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.

ధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని హామీలు ఇచ్చి మోసం చేసిన రేవంత్‌రెడ్డి.. మహిళలు, నిరుద్యోగులు, రైతులు, వృద్ధులు అన్ని వర్గాలను మోసం చేశారని గంప గోవర్ధన్‌ పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా, ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాళేశ్వరం కూలిందంటూ దుష్ప్రచారం చేశారన్నారు. దీనిని గ్రామగ్రామాన ప్రజలకు వివరించి కాంగ్రెస్‌కు బుద్ది చెబుతామన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్‌, జుక్కల్‌, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు హన్మంత్‌ సింధే, జాజాల సురేందర్‌, పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి జుబేర్‌, జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ ప్రేమ్‌కుమార్‌, మాజీ జెడ్పీటీసీ మిన్కూరి రాంరెడ్డి, మాజీ ఎంపీపీలు బాలమణి, దశరథ్‌రెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌లు నల్లవెల్లి అశోక్‌, కపిల్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ కుంబాల రవి, నాయకులు కుంబాల ప్రభాకర్‌, బాల్‌చంద్రం, మోహన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, బలవంతరావ్‌, శంకర్‌, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

ప్రజల దృష్టిని మళ్లించేందుకే..

అందులో భాగంగానే

కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం

మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌

హరీశ్‌రావు పవర్‌ పాయింట్‌

ప్రజెంటేషన్‌ను వీక్షించిన నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement