
ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి
రాజంపేట: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం ఆయన ఆర్గొండలో పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో బాలకృష్ణను ఆదేశించారు. అంతకుముందు ఆయన ప్రైమరీ స్కూల్‌ను సందర్శించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులను గణితంలో పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందించారు. పాఠశాల ప్రాంగణంలో మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో డీఈవో రాజు, మండల ప్రత్యేకాధికారి అపర్ణ, తహసీల్దార్ జానకి, ఎంఈవో పూర్ణచందర్‌రావు, ఎంపీవో రఘురాం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం పరిశీలన
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం పరిశీలించారు. సీసీ కెమెరాలు, రికార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచన లు ఇచ్చారు. బందోబస్తు పకడ్బందీగా ఉండాలని సూచించారు. ఆయన వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, సిబ్బంది ఉన్నారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్