
అథ్లెటిక్స్‌లో జిల్లాకు పతకాల పంట
కామారెడ్డి అర్బన్: హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్స్ షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. అండర్–16 జావెలిన్ త్రోలో కె.ఆనంద్, అండర్–20 డెకాథ్లాన్‌లో జి.పరశురాంలు బంగారు పతకాలు సాధించగా.. అండర్–18 వెయ్యిమీటర్ల పరుగులో కె.హరిత కాంస్య పతకం పొందారు. అండర్–20లో ఎం.ఈశ్వర్ 800 మీటర్ల పరుగులో వెండి, 1,500 మీటర్ల పరుగులో కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. మహిళా విభాగంలో కె.మేఘన జావెలిన్ త్రోలో కాంస్య పతకం సాధించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్ అభినందించారు.

అథ్లెటిక్స్‌లో జిల్లాకు పతకాల పంట

అథ్లెటిక్స్‌లో జిల్లాకు పతకాల పంట

అథ్లెటిక్స్‌లో జిల్లాకు పతకాల పంట

అథ్లెటిక్స్‌లో జిల్లాకు పతకాల పంట