
నిజాంసాగర్ నీటి విడుదల
నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు మంగళవారం నీటి విడుదల చేపట్టినట్లు నీటిపారుదల శాఖ ఏఈ అక్షయ్ తెలిపారు. 600 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ప్రధాన కాలువ ద్వారా ప్రవహిస్తున్న నీటిని ఆయకట్టు ప్రాంత రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నేడు పోచారం ప్రాజెక్టు నుంచి..
నాగిరెడ్డిపేట: పోచారం ప్రాజెక్టు నుంచి బుధవారం నీటిని విడుదల చేయనున్నట్లు ఇరిగేషన్ డీఈఈ వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోచారం ఆయకట్టు పరిధిలో వానాకాలం పంటల సాగు నిమిత్తం ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువలోకి నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1.820 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1.244 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు.