
కేంద్ర పభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి
మాచారెడ్డి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఇంటింటా ప్రచారం చేయాలని బీజేపీ కామారెడ్డి ఆసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి సూచించారు. సోమవారం మాచారెడ్డి, పాల్వంచ మండలాల్లో ఏర్పాటు చేసిన బీజేపీ పోలింగ్ బూత్ సంపర్క్ అభ్యాస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ వచ్చేలా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. మాచారెడ్డి, పాల్వంచ మండలాల అధ్యక్షులు సురేష్, అనిల్, నేతలు శ్రీనివాస్‌గౌడ్, మహేందర్‌రెడ్డి తదివతరులు ఉన్నారు.
నస్రుల్లాబాద్: మైలారంలో బీజేపీ అధ్వర్యంలో పోలింగ్ బూత్ సంపర్క్ అభ్యాన్ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా 137, 138, 148, 149 బూత్‌లలో గల కమిటీ సభ్యులు ప్రతి ఇంటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ బీజేపీ పథకాల గురించి వివరించారు. నేతలు వడ్ల సతీష్, హన్మాండ్లు, పవన్, లక్ష్మణ్, రామ్, శేఖర్, రాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో పథకాలకు సంబందించిన కరపత్రాలను బీజేపీ నాయకులు పంపిణీ చేశారు. పార్టీ మండల అద్యక్షుడు సంతోష్‌రెడ్డి, నాయకులు గంగారెడ్డి, వెంకట్‌రావు, రాజిరెడ్డి, దత్తాత్రేయ, రాజు, శ్రీకాంత్, నవీన్, శ్రీను,మహేష్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: పట్టణ పరిధిలోని దేవునిపల్లి 12వ వార్డులో బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు చిన్నోళ్ల రజనీకాంత్‌రావు ఆధ్వర్యంలో సోమవారం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఇంటింటి ప్రచారం చేశారు. నేతలు పెద్దోళ్ల గోపాలరావు తదితరులు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.