
క్షేత్ర స్థాయిలో పంటల పరిశీలన
గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రం శివారులో సోమవారం క్షేత్రస్థాయిలో సోయా, పత్తి పంటలను పరిశీలించినట్లు ఏవో రాజలింగం తెలిపారు. సస్య రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు తెలిపారు. సోయా, పత్తి పంటల్లో కాండం తొలిచే పురుగు ఆశించినట్లు గుర్తించామన్నారు. కాండం తొలిచే పురుగు నివారణకు రైతులు హెమామెక్టిన్ బెంజాయిట్ 100 గ్రాములు, క్లోరాంతనిప్రోల్ 100 మి.లీ.ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు. పత్తిలో తయోమెతాక్సిన్ 100 మి. లీను హెమామెక్టిన్ బెంజాయిట్ 200 గ్రాములును 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరానికి వారానికి ఒకసారి పిచికారీ చేయాలని సూచించారు.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
నిజాంసాగర్(జుక్కల్): సైబర్ నేరాలతో యువత, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్సై శివకుమార్ సూచించారు. సోమవారం నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో సైబర్ నేరాలు, షీటీం సేవలు, డ్రగ్స్, రోడ్డు ప్రమాదాల నివారణపై జిల్లా పోలీస్ బృందం ఆధ్వర్యంలో కళా ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలని, సెల్‌ఫోన్లకు బానిసై భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సూచించారు. కళాబృందం సభ్యులు తిరుపతి, నవోదయ ఇన్‌చార్జీ ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు.

క్షేత్ర స్థాయిలో పంటల పరిశీలన