
ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు ఇప్పించాలి..
రెండు నెలలు దాటినా పునాదుల వరకు నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు రావడం లేదని దోమకొండ మండలం చితంమాన్‌పల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులు వాపోయారు. వారు మాట్తాడుతూ.. గ్రామంలో 22 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా అధికారుల సూచన మేరకు పనులు చేపట్టామన్నారు. పునాదుల వరకు రూ.3 లక్షలకు పైగా ఖర్చు పెట్టామన్నారు. అన్ని పత్రాలను సమర్పించామన్నారు. మొదటి విడతగా రూ.లక్ష రావాల్సి ఉందన్నారు. గ్రామంలో ఒక్కరికి మాత్రమే డబ్బులు మంజూరు చేశారని తెలిపారు. అయినా రెండు నెలలుగా అధికారులు బిల్లులు మంజూరు చేయడం లేదని వాపోయారు. బిలుల్లు ఇప్పించాలని కోరుతూ ప్రజావాణిలో మొరపెట్టుకున్నారు.