
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
నిజాంసాగర్(జుక్కల్): ప్రభుత్వ ఆస్పత్రుల్లో సమయపాలన పాటించకుండా, విధులను నిర్లక్ష్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హెచ్చరించారు. సీజన్ వ్యాధుల కాలం కావడంతో ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. సోమవారం సాయంత్రం ఆయన సబ్ కలెక్టర్ కిరణ్మయితో కలిసి జుక్కల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరాతీశారు. జుక్కల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆనంద్, డ్యూటీ డాక్టర్ విఠల్ అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులను నిర్లక్ష్యం చేసిన ఇద్దరికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డీసీహెచ్‌ఎస్ విజయలక్ష్మిని ఫోన్ ద్వారా ఆదేశించారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హెచ్చరిక
జుక్కల్ ఆస్పత్రి వైద్యులకు షోకాజ్ నోటీసులు