డుమ్మాలు కుదరవిక! | - | Sakshi
Sakshi News home page

డుమ్మాలు కుదరవిక!

Aug 5 2025 6:47 AM | Updated on Aug 5 2025 6:47 AM

డుమ్మాలు కుదరవిక!

డుమ్మాలు కుదరవిక!

వైద్యులు, సిబ్బంది డుమ్మాలకు చెక్‌ పెట్టేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిని అమలు చేసేందుకు ఆ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

కామారెడ్డి టౌన్‌ : జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి పీహెచ్‌సీలో గతంలో ఓ వైద్యురాలు విధులకు హాజరుకా కున్నా రిజిస్టర్‌లో సంతకాలు చేశారు. మరో వైద్యురాలు ముందస్తుగానే రెండురోజుల సంతకాలు చేసి డుమ్మా కొట్టడంతో అధికారులు విచారణ జరిపించారు. ఇలా చాలా ఆస్పత్రులలో జరుగుతోంది. ఉ దయం 10 దాటిన తర్వాత కూడా వైద్యులు రా వడం లేదని, ఇలా వచ్చి అలా వెళ్తున్నారని ఆరోప ణలు ఉన్నాయి. డుమ్మాలకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వైద్యులు, సిబ్బందికి ముఖ గు ర్తింపు హాజరు అమలు చేయాలని నిర్ణయించింది.

జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ ఉన్నాయి. వీటి పరిధిలో 329 సబ్‌ సెంటర్లున్నాయి. వైద్యులు 53 మంది, అలాగే స్టాఫ్‌నర్సులు, ఏఎన్‌ఎంలు, ల్యాబ్‌ టెక్నిషియన్‌లు, ఫార్మసిస్టులు, సిబ్బంది మరో 420 మందికిపైగా విధులు నిర్వహిస్తున్నారు. వీరందరికి ముఖ హాజరుకు సంబంధించిన మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. ఆధార్‌ లింక్‌, ఐరిస్‌తో ఈ యాప్‌ ద్వారా ఎలా అటెండెన్స్‌ నమోదు చేయాలో అవగాహన కల్పిస్తున్నారు. ఇంటి వద్ద నుంచే హాజరు వేసుకుందామనుకుంటే కుదరదు. యాప్‌ ద్వారా ఆస్పత్రి లొకేషన్‌లో, సబ్‌ సెంటర్‌ల హెడ్‌ క్వార్టర్స్‌లో మాత్రమే ముఖ హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది.

కాగా సోమవారం నుంచే నూతన విధానం ద్వారా హాజరు నమోదు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఉత్తర్వులు జారీ చేసినా చాలాచోట్ల సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.

మెరుగైన వైద్య సేవలు అందుతాయి

జిల్లాలోని పీహెచ్‌సీలలో విధులు నిర్వహించే వైద్యుల నుంచి క్లాస్‌–4 ఉద్యోగుల వరకు అందరూ ముఖ గుర్తింపు హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అందరితో ఆ యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించాం. నూతన హాజరు విధానాన్ని త్వరలోనే పూర్తిగా అమలు చేస్తాం. ఈ నూతన విధానం ద్వారా వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తారు. దీంతో ప్రజలకు మరింతగా మెరుగైన వైద్య సేవలు అందుతాయి.

– చంద్రశేఖర్‌, డీఎంహెచ్‌వో, కామారెడ్డి

వైద్య, ఆరోగ్యశాఖలో

ముఖ గుర్తింపు హాజరు

పీహెచ్‌సీలలో వైద్యుల నుంచి

సిబ్బంది వరకు..

ఇన్‌, అవుట్‌ హాజరు మొబైల్‌ యాప్‌

ద్వారానే నమోదు..

అమలుకు కసరత్తు చేస్తున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement