సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఇన్‌చార్జీల పాలన | - | Sakshi
Sakshi News home page

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఇన్‌చార్జీల పాలన

Aug 5 2025 6:47 AM | Updated on Aug 5 2025 6:47 AM

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఇన్‌చార్జీల పాలన

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఇన్‌చార్జీల పాలన

దోమకొండ : సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఉమ్మడి జిల్లాలో 10 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. వీటిలో కామారెడ్డి జి ల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, దోమకొండల్లో, నిజామాబాద్‌ జిల్లాలో నిజా మాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, బోధన్‌, ఆ ర్మూర్‌, భీమ్‌గల్‌లో కార్యాలయాలు ఉన్నాయి. ఇందులో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌ గల్‌లలో మాత్రమే రెగ్యులర్‌ సబ్‌రిజిస్ట్రార్‌లు ఉన్నా రు. బిచ్కుంద, బాన్సువాడ, దోమకొండ, నిజామబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌ కార్యాలయా ల్లో ఇన్‌చార్జీలతో నెట్టుకొస్తున్నారు. దీనికి తోడు ఆ యా కార్యాలయాల్లో సీనియర్‌ అసిస్టెంట్లు, జూని యర్‌ అసిస్టెంట్లు, అటెండర్లు, రికార్డు అసిస్టెంట్ల పోస్టులు కూడా చాలావరకు ఖాళీగా ఉన్నాయి. దీంతో కార్యాలయాల్లో తాత్కాలిక సిబ్బందితో రోజు వారి కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ప్రతి స బ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌ తో పాటు ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్లు, కంప్యూట ర్‌ డాటా ఆపరేటర్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌, ఇద్దరు అటెండర్లు ఉండాలి. కానీ ఎక్కడా పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయాలకు వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో దస్త్రాల వివరాలను అనధికారికంగా ప్రైవేట్‌ వ్యక్తుల సాయంతో ఆన్‌లైన్‌లో నమోదు చేయిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసిన తర్వాత డాక్యుమెంట్లను స్కానింగ్‌ చేసి వెంటనే అందించాల్సి ఉంది. కాని సిబ్బంది కొరతతో స్కానింగ్‌ కూడా ఆలస్యం అవుతోంది. ఉన్నతాధికారులు స్పందించి రెగ్యులర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌లు, సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు.

దోమకొండలో..

దోమకొండలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ సబ్‌రిజిస్ట్రార్‌తోపాటు ఒక సీనియర్‌ అసిస్టెంట్‌, మరో ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్లు, ఇద్దరు అటెండర్లు, టా ఎంట్రీ ఆపరేటర్‌లు, రికార్డు అసిస్టెంట్‌ ఉండాలి. సబ్‌రిజిస్ట్రార్‌ లేకపోవడంతో ఇన్‌చార్జీ పాలన సాగుతోంది. సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టు ఖాళీగా ఉంది. ఇద్దరు అటెండర్లు ఉండగా.. ఒకరిని డిప్యుటేషన్‌పై కామారెడ్డి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి పంపించారు. డాటా ఎంట్రీ ఆపరేటర్‌తో పాటు రికార్డు అసిస్టెంటు పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి.

ఉన్నతాధికారులకు వివరించాం

ఉమ్మడి నిజామాబాద్‌జిల్లాలో ఐదుచోట్ల సబ్‌ రిజిస్ట్రా ర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆయా స్థానాలలో సీనియర్‌ అసిస్టెంట్లకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించాం. కొన్నిచోట్ల సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, డాటా ఎంట్రీ అపరేటర్లు కూడా లేరు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం.

– ప్రసూన, జిల్లా రిజిస్ట్రార్‌, నిజామాబాద్‌

దోమకొండలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

వేధిస్తున్న అధికారులు, సిబ్బంది కొరత

పలు పోస్టులు ఖాళీ

ఇబ్బంది పడుతున్న ప్రజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement