
ఖేలో ఇండియాకు అనూహ్య స్పందన
కామారెడ్డి అర్బన్: జిల్లా యోగా భవన్‌లో సోమవా రం నిర్వహించిన అస్మిత ఖేలో ఇండియా అండర్– 18, 18 –55 కేటగిరిల్లో నిర్వహించిన యోగాసన సి టీ లీగ్–2025 కు అనూహ్య స్పందన లభించింది. 460 మంది పేర్లు నమోదు చేసుకోగా 419 మంది పోటీలకు హాజరయ్యారు. ఈ పోటీలకు అనూహ్య స్పందన వచ్చిందని జిల్లా యోగా అసోసియేషన్ అ ధ్యక్షుడు యోగా రాంరెడ్డి తెలిపారు. మూడు కేటగిరీల్లో పోటీలు నిర్వహించామని పేర్కొన్నారు. విజే తలకు బంగారు, వెండి, కాంస్య పతకాలను ప్రదా నం చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజ న, క్రీడల అధికారి జగన్నాథన్, జీసీడీవో సుకన్య, ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం, యోగా అసోసియేషన్ నిర్వహణ కార్యదర్శి అనిల్‌రెడ్డి, యో గాచార్యులు జి.అంజయ్యగుప్తా, పి.అంజయ్య, ప్ర తినిధులు బాస రఘుకుమార్, శ్రీలత, రాజ్‌కుమా ర్, లక్ష్మీరాజం, క్రీడల సాంకేతిక పరిశీలకులు జి.ప్రసాద్, ఏ.రమేష్, సిద్ధాగౌడ్, ఎల్లయ్య పాల్గొన్నారు.
విజేతలు..
కొండేరి శివాని, సీహెచ్.హేమవంతిని, శ్రీహర్షిత, సీహెచ్.సహస్ర, బి.సింధూజ, పి.హారిక, భూక్య పుష్పలత, గడ్డం కవిత, బట్టు నిఖిత, కె.స్రవంతి.