
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
● ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్
బాన్సువాడ : పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్ అన్నారు. శనివారం తాడ్కోల్‌లో కొత్త రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క రేషన్ కార్డును పేదలకు ఇవ్వలేదని, ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి పేదల బాధలు గుర్తించి కొత్త రేషన్ కార్డులు అందజేస్తున్నారని, పేదల ఆకలి తీర్చే ఆయుధమే రేషన్ కార్డు అని అన్నారు. రేషన్‌కార్డులు ఇవ్వడంతో పాటు ఈ నెల నుంచే రేషన్ బియ్యం అందజేస్తున్నామని, అన్ని సంక్షేమ పథకాలను లబ్ధిపొందే అవకాశం దక్కిందన్నారు. రేషన్‌కార్డు లేని ప్రతి ఒక్కరికి రేషన్‌కార్డు అందుతుందని అన్నారు. నాయకులు గంగుల గంగారాం, మధుసూదన్‌రెడ్డి, హన్మాండ్లు, సాయిలు, అందే రమేష్, అంజయ్య, మేక రాంరెడ్డి, లక్ష్మాగౌడ్ ఉన్నారు.