
‘డీటీఎఫ్ పోరాటాల ఫలితమే ఉపాధ్యాయ ప్రమోషన్లు’
కామారెడ్డి అర్బన్: డీఎస్సీ–2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు, ఉపాధ్యాయులకు ప్రమోషన్ల షెడ్యూల్ ప్రకటన డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) చేసిన న్యాయ పోరాటాల ఫలితమేనని ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సీ ప్రభాకర్ అన్నారు. స్థానిక కర్షక్ బీఎడ్ కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. 2004 నుంచి అమలు అవుతున్న కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి అందరికి ఓపీఎస్ అమలు చేయాలని, ప్రమోషన్లతో పాటు డిప్యూటీ డీఈవోలు, ఎంఈవో, జూనియర్ లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 30 డిమాండ్లతో 5న నిర్వహించే ఉపాధ్యాయుల ధర్నా ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చా రు. నేతలు దేవులా, విజయరామరాజు, శ్యాంకుమార్, రాములు, గంగారాం, తదితరులు పాల్గొన్నారు.