ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు | - | Sakshi
Sakshi News home page

ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు

Aug 3 2025 3:32 AM | Updated on Aug 3 2025 3:32 AM

ఎల్లా

ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు

కామారెడ్డి అర్బన్‌: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు జన్మదినం సందర్భంగా శనివారం ఎంప్లాయీస్‌ జేఏసీ జిల్లా నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కామారెడ్డి అశోక్‌నగర్‌లోని మదన్‌మోహన్‌రావు నివాసంలో జేఏసీ నాయకులు కలిసి సన్మానించారు. జేఏసీ చైర్మన్‌ నరాల వెంకట్‌రెడ్డి, టీఎన్‌జీవోస్‌ నాయకులు నాగరాజు, దేవరాజు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

నిజాంసాగర్‌(జుక్కల్‌): మండల కేంద్రంతో పాటు ఒడ్డేపల్లి గ్రామంలో శనివారం కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఏలే. మల్లికార్జున్‌ చేతుల మీదుగా సీఎం సహాయనిధి చెక్కులను బాధితులకు అందజేశారు. బంజపల్లి, సుల్తాన్‌నగర్‌, ఒడ్డేపల్లి, అచ్చంపేట, వెల్గనూర్‌, మాగి గ్రామాలకు చెందిన 22 మందికి రూ. 14 లక్షల విలువైన చెక్కులు మంజూరయ్యాయని మండల అధ్యక్షుడు తెలిపారు. నాయకులు ప్రజా పండరి, రమేష్‌, రాము రాథోడ్‌ తదితరులు ఉన్నారు.

కల్యాణ లక్ష్మి చెక్కులు..

తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఎండ్రియాల్‌లో శనివారం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ ఆదేశాల మేరకు ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. పార్టీ అధికార ప్రతినిధి షౌకత్‌అలీ, నాయకులు శ్యాంరావు, సుధాకర్‌రావు, సంజీవులు, నారాయణరెడ్డి, గంగారెడ్డి, కార్యదర్శి పాల్గొన్నారు.

పాఠశాలకు డెస్క్‌లు..

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన ఆకుల మహేందర్‌ అనే పూర్వ విద్యార్థి తాను చదువుకున్న పాఠశాలకు డెస్క్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన మహేందర్‌ను గ్రామస్తులు అభినందించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి మహేందర్‌ మాట్లాడుతూ..త్వరలో విద్యార్థుల సౌకర్యార్థం మరుగుదొడ్లు నిర్మిస్తానని పేర్కొన్నారు. విండో చైర్మన్‌ సదాశివరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు నర్సింహారావు, సీడీసీ చైర్మన్‌ ఇర్షాదొద్దిన్‌, వీడీసీ చైర్మన్‌ సత్యం, సీనియర్‌ నాయకులు మహేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాశీయాత్రకు యూత్‌ సభ్యులు

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెందిన అంజనీపుత్ర సిండికేట్‌ సభ్యులు శనివారం కాశీయాత్రకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హిందూ ధర్మ చరిత్ర తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేవాలయాల చరిత్ర, సంస్కృతి, సనాతన ధర్మ విశిష్టతను తెలుసుకోవటానికి ఈ యాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు 
1
1/2

ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు

ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు 
2
2/2

ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement