
ఘనంగా వన మహోత్సవం
సాక్షి నెట్‌వర్క్: జిల్లాలో పలుచోట్ల శనివారం వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కా ర్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. ఎల్లారెడ్డి మండలం రుద్రారంలో, పెద్దకొడప్‌గల్ మండలం కాస్లాబాద్‌లో, బాన్సువాడ మండలం బోర్లంలో ఈత మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎకై ్సజ్ అధికారులు మాట్లాడుతూ.. కల్తీ కల్లు నివారణకు గాను ఈత మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు .
ఆత్మీయమైన పండగ రక్షాబంధన్
ఎల్లారెడ్డి: ఆత్మీయమైన పండగ రక్షాబంధన్ అని ఓంశాంతి దీదీ సౌమ్య అన్నారు. రక్షాబంధన్ కార్యక్రమంలో భాగంగా ఓంశాంతి ఆధ్వర్యంలో పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ మహేష్‌కుమార్, తహసీల్దార్ ప్రేమ్‌కుమార్‌లకు దీదీలు రాఖీలను కట్టారు. అన్నాచెల్లెలు, అక్కాతమ్ముడి ప్రియమైన పండుగ రక్షాబంధన్ అని అన్నారు. దీదీలు లలిత, కవిత, గంగలత తదితరులున్నారు.
పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమం వీక్షణ
నస్రుల్లాబాద్: మిర్జాపూర్ రైతు వేదికలో శనివారం పీఎం కిసాన్ 20వ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు లైవ్‌లో వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు మాట్లాడుతూ.. రైతుల ఖాతాల్లో అనుకున్న సమయానికి నగదు జమ చేసిన ఘనత పీఎం మోదీ పాలనలోనే సాధ్యం అన్నారు. అనంతరం బదిలీపై వచ్చిన ఏఈవో గ్రీష్మను సన్మానించారు. బీజేపీ నాయకులు సంతోష్, అనుసూరి శ్రీనివాస్, అరిగె నారాయణ, గొడిసెల యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా వన మహోత్సవం