
నాడు రాజన్న.. నేడు రేవంతన్న
భిక్కనూరు: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా నాడు దివంగత సీఎం రాజన్న(వైఎస్సార్) నేడు రేవంతన్నా అహర్నిశలు కృషి చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ అన్నారు. శనివారం భిక్కనూరులో నూతన రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సన్న బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రెండేళ్లలోనే పగుళ్లు రావడం చూస్తుంటే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎంత అవినీతి జరిగిందో అర్థం చేసుకోవాలన్నారు. శ్రీరాం సాగర్, నిజాంసాగర్, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు అన్నీ కాంగ్రెస్ హయాంలోనే నిర్మితమయ్యాయని ఇప్పటికి అవి పగుళ్లు చూపలేదని గుర్తు చేశారు. రేషన్ కార్డు 13 ఏళ్ల తర్వాత మంజూరు కావడం పట్ల సితార అనే లబ్ధిదారు హర్షం వ్యక్తం చేశారు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ రాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బీంరెడ్డి, మాజీ ఎంపీపీలు బల్యాల రేఖ సుదర్శన్, తోగరి సుదర్శన్, జాంగారి గాలిరెడ్డి, తహసీల్దార్ సునీత, ఎంపీడీవో రాజ్‌కిరన్‌రెడ్డి, ఎంఈవో రాజ్‌గంగారెడ్డి పాల్గొన్నారు.
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
కామారెడ్డి టౌన్: పేదల సంక్షేమం కోసమే ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని గోసంగి, ఇందిరానగర్ కాలనీ, హరిజనవాడలో లబి ్ధదారులకు రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అర్హులందరికి రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలో సీసీ రోడ్డు, మురికి కాలువల నిర్మాణానికి రూ. 7 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.
● ప్రజల సంక్షేమమే వీరి ధ్యేయం
● ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ