
వృద్ధులకు పింఛను కష్టాలు
దోమకొండ: వృద్ధులకు పింఛన్ కష్టాలు తప్పడం లేదు. నూతనంగా తీసుకువచ్చిన ఫేస్ రికగ్నిషన్ విధానంతో వారి కష్టాలు మరింతగా పెరిగాయి. శనివారం దోమకొండ మండల కేంద్రంలో పింఛన్లు ఇవ్వడానికి చివరి తేదీగా అధికారులు నిర్ణయించారు. గతంలో వేలిముద్రలు రానివారికి గ్రామ పంచాయితీ కార్యదర్శి లేదా పంచాయతీ అధికారి వేలిముద్రతో పింఛన్ ఇచ్చేవారు. కాని ప్రస్తుతం వచ్చిన ఫేస్ రికగ్నిషన్ వల్ల ప్రతి పింఛన్‌దారుడు కచ్చితంగా వచ్చి పింఛన్ తీసుకోవాలి. దీంతో ప్రతి ఒక్కరు తమ ఇంటిలో వృద్ధులను ఆటోలు, ఇతర వాహనాల్లో పింఛన్ పంపిణీ చేసే కేంద్రం వద్దకు తీసుకొచ్చారు. వృద్ధులను తమ చేతుల మీదుగా ఎత్తుకుని పింఛన్ కేంద్రాల్లోకి తీసుకొచ్చి డబ్బులు తీసుకున్నారు. అధికారులు పింఛన్‌ను బ్యాంకు ఖాతా ద్వారా అందించాలని, ప్రస్తుత విధానంతో తాము చాలా కష్టాలు పడుతున్నామని చాలా మంది వాపోతున్నారు.
ఐరిస్ పరిశీలన
భిక్కనూరు: మండల కేంద్రంలో పింఛన్‌దారుల ఐరిస్‌ను డీఆర్‌డీవో సురేందర్ శనివారం పరిశీలించారు. ప్రతి పింఛన్‌దారు తప్పనిసరిగా ఐరిస్ చేయించుకోవాలని ఆయన సూచించారు. ఆయన వెంట డీపీఎం సాయిలు, ఏపీఎం సాయిలు, సీసీ శ్రీనివాస్, సబ్ పోస్ట్ మాస్టర్ శివాజీ ఉన్నారు.