
మెరుగైన ఫలితాల కోసం కృషి చేయాలి
● కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
కామారెడ్డి టౌన్: ఈ విద్యాసంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం విద్యాశాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తీర్ణతలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉండాలన్నారు. సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలన్నారు. డీఈవో ఎస్.రాజు, తదితరులు పాల్గొన్నారు.
బల్దియా అభివృద్ధికి కృషి చేయండి
కామారెడ్డి టౌన్: మున్సిపల్ అభివృద్ధికి, వార్డులోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణంలో ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు, ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధానంగా సానిటేషన్, తాగునీటి సమస్యల సమస్య రాకుండా నిరంతరంగా పర్యవేక్షించాలని కమిషనర్‌కు సూచించారు. కమిషనర్ రాజేందర్‌రెడ్డి, టీపీవో గిరిధర్, ఆర్‌వో రవిగోపాల్, ఏఈ శంకర్ తదితరులు పాల్గొన్నారు.