
ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని పారదర్శకంగా..త్వరగా ఇళ్లను నిర్మించుకోవాలని మండల ప్రత్యేక అధికారి శివ కుమార్ అన్నారు. సోమారం తాండాలో కొనసాగుతున్న ఇళ్ల నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు. అలాగే గ్రామంలో తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీవో సయ్యద్ సాజిద్ అలీ, తదితరులు పాల్గొన్నారు.
కొండాపూర్‌లో..
రాజంపేట: కొండాపూర్ జీపీ పరిధిలో శుక్రవారం మండలాధికారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను అధికారులు పరిశీలించారు. గ్రామ సంఘాల ద్వారా అవసరమున్నవారికి బ్యాంకు రుణాలు ఇప్పించి ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఎంపీడీవో బాలకృష్ణ, కార్యదర్శి శ్రీజ, సీసీ భాగయ్య, హౌసింగ్ ఏఈ రాము పాల్గొన్నారు.