
మోడల్‌స్కూల్ విద్యార్థులకు క్రీడాదుస్తుల అందజేత
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఎన్‌ఆర్‌ఐ రోష్ని నాగర్ కాంతి గోపాల్‌పేట మోడల్ స్కూల్‌లోని 25 మంది విద్యార్థులకు శుక్రవారం క్రీడా దుస్తులను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఉంటున్న రోష్ని నాగర్‌కాంతి తాతయ్య, డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ నల్మాస్ ఆనందమ్, అమ్మమ్మ భాగ్యలక్ష్మి శుక్రవారం గోపాల్‌పేట మోడల్‌స్కూల్‌లోని విద్యార్థులకు ఈ దుస్తులను అందజేశారు. అలాగే పాఠశాలలోని విద్యార్థుల సౌకర్యార్థం డాక్టర్ నల్మాస్ ఆనందమ్ రూ.10వేలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. నల్మాస్ ఆనందమ్, భాగ్యలక్ష్మి దంపతులను ఉపాధ్యాయులతో కలిసి ప్రిన్సిపాల్ రాంప్రసాద్ ఘనంగా సత్కరించారు.