
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
బాన్సువాడ: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు వన మహోత్సవంలో భాగంగా ఆమె మొక్కలు నాటారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో వాటిని సంరక్షించే బాధ్యత అంత కన్నా ముఖ్యమని అన్నారు. ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటాలని సూచించారు. చెట్ల వల్ల వర్షాలు సంవృద్ధిగా కురుస్తాయని, ప్రజలందరు సుఖసంతోషాలతో ఉంటారని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వరప్రసాద్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, అటవీశాఖ సెక్షన్ అధికారి సంజీవ్, ఏపీఎం గంగాధర్, అధికారులు ఉన్నారు.
మధ్యాహ్న భోజన కార్మికుల నిరాహార దీక్ష
బాన్సువాడ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు నిరాహార దీక్షలు చేపట్టారు. శుక్రవారం మధ్యాహ్న భోజన నిర్వాహకులు బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చక్రపాణి మాట్లాడుతూ.. ఆరు నెలలుగా బిల్లలు రావడం లేదని, అప్పులు చేసి పాఠశాలల్లో విద్యార్థులకు భోజనం వండి పెడుతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం పెట్టిన మెనూ ప్రకారం ఒక్కో విద్యార్థికి రూ.25 ఖర్చు అవుతుందని, ప్రభుత్వం మాత్రం రూ.11 ఇచ్చి చేతులు దులుపుకుంటుందని విమర్శించారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ప్రభుత్వమే రూ.10 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు దుబాస్ రాములు, యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సోఫియా, నాయకులు బాల్‌రాజ్, సంగీత, సరళ, స్వరూప తదితరులున్నారు.
బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి