
చికిత్స పొందుతూ ఒకరి మృతి
పెద్దకొడప్‌గల్(జుక్కల్): రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మండల కేంద్రంలోని జాతీయ రహదారి 161పై గల బ్రిడ్జి సైడ్‌వాల్‌ను ఇటుక లారీ గురువారం ఢీకొట్టడంతో ఘటన స్థలంలోనే ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడిన నాందేడ్‌కు చెందిన గణేష్ (20) నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా శుక్రవారం తెల్లవారుజామున పరిస్థితి విషమించి మృతిచెందినట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. ఘటన స్థలంలో పిట్లం మండలంలోని రూమ్‌తండాకు చెందిన నర్సింగ్ మృతి చెందగా, అతడి భార్య హలవత్ సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
మేకల చోరీకి పాల్పడిన నిందితుల పట్టివేత
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలో మేకలను చోరీ చేసి, సంతలో విక్రయిస్తు నిందితులను గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా.. మండలంలోని శెట్పల్లి గ్రామంలో కందూర్ మైసయ్య, తక్కనోళ్ల లింగంకు చెందిన రెండు మేకలు కనిపించకపోవడంతో వారు అనుమానంతో శుక్రవారం పిట్లం సంతకు వెళ్లారు. అక్కడ అయ్యపల్లి గ్రామానికి చెందిన కంట్రపల్లి ప్రవీణ్, చల్ల మహేష్ వారి మేకలను విక్రయించడానికి ఉంచగా, పట్టుకొని పట్టుకొని గ్రామ పంచాయతీకి తీసుకువచ్చారు. అక్కడ నిందితులను విచారించగా అయ్యపల్లి గ్రామానికి చెందిన బొక్కల చిన్న కిష్టయ్య, చిలుక లక్ష్మినారాయణతో కలిసి మేకలను దొంగిలించి అమ్ముకున్నట్లు తెలిపారు. వీరు నలుగురు కలిసి అయ్యపల్లి తండాకు చెందిన దేవసోత్ బాల్‌సింగ్‌కు చెందిన 4 మేకలను చోరీ చేసి బాన్సువాడ సంతలో గురువారం విక్రయించినట్లు తెలిపారు. దీంతో బాధితులు, గ్రామస్తులు వారిని పట్టుకుని లింగంపేట పోలీసులకు అప్పగించారు.
అధికారులు మారినా పేర్లు మారని వైనం
నస్రుల్లాబాద్: బొమ్మన్‌దేవ్‌పల్లి జీపీ భవనంలో సమాచార శాఖ అధికారులు మారినా కూడా బోర్డుపై పేర్లు మాత్రం తొలగించలేదు. గతంలో ఎంపీడీవోగా ఉన్న సుబ్రహ్మణ్యం బదిలీ అయి ఏడాది పూర్తివుతుంది. ఆయన ప్రస్తుతం రిటైర్డ్ కూడా అయ్యారు. ఎంపీవో రాము జుక్కల్ నియోజకవర్గానికి బదిలీపై వెళ్లి ఏడాది కావస్తోంది. పంచాయతీ కార్యదర్శి ముఖీద్‌కు టీచర్ ఉద్యోగం రావడంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. బోర్డులో ఉన్న ఒక్క అధికారి కూడా స్థానికంగా పనిచేయడం లేదు. ఇంత కాలం మండల, జిల్లా స్థాయి అధికారులు సందర్శించినా కూడా బోర్డు మీద పేర్లను మాత్రం మార్చలేదు. ఇప్పటికై నా పేర్లు మార్చాలని స్థానికులు కోరుతున్నారు.

చికిత్స పొందుతూ ఒకరి మృతి