
క్రెడా అభివృద్ధికి కృషి చేస్తా
కామారెడ్డి టౌన్: కామారెడ్డి రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ ఏజెంట్స్ అసోసియేషన్(క్రెడా) అభివృద్దికి కృషి చేస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం క్రెడా ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిశారు. క్రెడా భవన నిర్మాణానికి తనవంతు సహకారం చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధ్యక్షుడు లక్ష్మీనర్సాగౌడ్, ప్రధాన కార్యదర్శి రాంచందర్ నాయక్, ప్రతినిధులు రాజలింగం తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన పలు సంఘాల నాయకులు
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి వైద్య కళాశాల సమీపంలోని మున్నూరుకాపు జిల్లా సంఘం వద్ద అభివృద్ధి పనులకు సహకారం అందించాలని సంఘం జిల్లా నాయకులు, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి కోరారు. సంఘం జిల్లా అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్‌రావు పటేల్, ప్రధాన కార్యదర్శి అంజయ్యపటేల్‌లు శుక్రవారం ఎమ్మెల్యేకు పనుల గురించి వివరించారు. అలాగే పట్టణంలోని ఆర్యవైశ్య సంఘాల నాయకులు సైతం ఎమ్మెల్యేను కలిసి తమ సంఘాల అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు.
ఆలయాల పునర్నిర్మాణానికి కృషి చేయాలని వినతి
రాజంపేట: మండల కేంద్రంలోని వేంకటేశ్వర స్వామి, రాజరాజేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఆలయాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయని, వీటి పునర్నిర్మాణానికి కృషి చేయాలని కోరుతూ శుక్రవారం రాజంపేట గ్రామస్తులు ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. తన సొంత నిధులతో ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి