మాందాపూర్‌లో పింఛనుదారుల కష్టాలు | - | Sakshi
Sakshi News home page

మాందాపూర్‌లో పింఛనుదారుల కష్టాలు

Aug 2 2025 6:17 AM | Updated on Aug 2 2025 6:17 AM

మాందా

మాందాపూర్‌లో పింఛనుదారుల కష్టాలు

బీబీపేట: మాందాపూర్‌లో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పింఛన్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పోస్టాఫీసు సిబ్బంది ఒకరే ఉండటంతో పాటు ముఖ చిత్రాలతో పింఛన్లను పంపిణీ చేయడంలో జాప్యం జరుగుతోంది. దీంతో లబ్ధిదారులు గంటల తరబడి క్యూలైన్లో వేచి చూడాల్సి వస్తోంది. అంతే కాకుండా పింఛన్ల కోసం ఇతర గ్రామాలకు వెళ్లి పింఛన్లు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికై నా ఎక్కువ మంది సిబ్బందిని నియమించి పింఛన్లను త్వరగా పంపిణీ చేయాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.

బీపీఎంపై చర్యలు తీసుకోవాలి

మద్నూర్‌(జుక్కల్‌): మండలంలోని పెద్ద తడ్గూర్‌, అవాల్‌గావ్‌ రెండు గ్రామాల పింఛన్‌ డబ్బులు పంపిణీ చేయడం లేదని పింఛనుదారులు శుక్రవారం మండల కేంద్రంలోని పోస్టు ఆఫీస్‌కు తరలివచ్చి, బీపీఎం ఖాజాపై చర్యలు తీసుకోవాలని సబ్‌ పోస్ట్‌ మాస్టర్‌కు వినతి పత్రం అందించారు. రెండు గ్రామాలకు చెందిన వృద్ధులు ప్రతి నెలా పింఛన్‌ డబ్బులు కోసం అవస్థలు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తిండీ తిప్పలు లేక వేచి ఉంటున్నా బీపీఎం ఖాజా వచ్చి డబ్బులు పంపిణీ చేయడం లేదని వారు విమర్శించారు. ప్రతి నెలా డబ్బులు సక్రమంగా పంపిణీ చేయడం లేదని, ఫోన్‌ చేసిన పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాడని వృద్ధులు ఫిర్యాదు చేశారు.

కొత్త రేషన్‌కార్డుల పంపిణీ

బాన్సువాడ రూరల్‌: రాంపూర్‌లో శుక్రవారం పంచాయతీ కార్యదర్శి సురేష్‌ కొత్తరేషన్‌ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎన్నో ఏళ్ళుగా రేషన్‌కార్డుల కోసం ఎదురు చూశామని, ప్రభుత్వం కార్డులు మంజూరు చేయడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు షేక్‌ అక్బర్‌, పర్వుగొండ, షేక్‌ అజీజ్‌, తదితరులు పాల్గొన్నారు.

బగళాముఖి అమ్మవారికి

ప్రత్యేక పూజలు

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలో బగళాముఖీ అమ్మవారి జన్మదినం సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్యోతిష్య పండితులు క్రాంతి పటేల్‌ ఆధ్వర్యంలో శ్రావణమాసం అష్టమిని పురస్కరించుకుని పూజలు చేశారు. అనంతరం అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో వెంకటేశం, రేవంతప్ప, సతీష్‌, సాయినాథ్‌ తదితరులున్నారు.

మాందాపూర్‌లో  పింఛనుదారుల కష్టాలు
1
1/1

మాందాపూర్‌లో పింఛనుదారుల కష్టాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement