
ఐకేపీ ఏపీఎం బదిలీ
మాచారెడ్డి: ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్ బదిలీపై కామారెడ్డి వెళ్లారు. ఆయన స్థానంలో భీమ్‌గల్ ఏపీఎంగా పనిచేసిన పప్పుల రవీందర్ వచ్చారు. బదిలీపై వెళ్తున్న శ్రీనివాస్‌ను సిబ్బంది సన్మానించారు.
నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి వినతి
భిక్కనూరు: మండల కేంద్రలోని సిద్ధరామేశ్వరాలయం అభివృద్ధికి నిధులు మంజూరు చేయించాలని కోరుతూ కౌసల్య ఫౌండేషన్ కన్వీనర్ జ్ఞాన ప్రకాశ్‌రెడ్డి శుక్రవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను కోరారు. ఈ మేరకు ఢిల్లీలో వినతి పత్రం అందజేశారు. అలాగే భిక్కనూరు రైల్వే స్టేషన్‌లో అన్ని రైళ్లు నిలిచేలా చూడాలని వినతి పత్రం ద్వారా కోరారు.
77వ సారి రక్తదానం
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి రక్తదాతల సమూహం వ్యవస్థాపకులు, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా సమన్వయకర్త ఎన్.బాలు శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి రక్తనిధి కేంద్రంలో 77వ సారి ఓ–పాజిటివ్ రక్తదానం చేశారు. గత 18 సంవత్సరాలుగా రక్తదానం చేస్తున్నానని, సాంకేతిక నైపుణ్యం ఎంత అభివృద్ధి చెందినా రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, రక్తదానం చేయడం ద్వారా ప్రాణదాతగా నిలవడంతో పాటు, దాతలు గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుందని రక్తదాత బాలు అన్నారు. రక్తదాతల సమూహం అధ్యక్షుడు జమీల్ హైమద్, ఉపాధ్యక్షుడు పర్ష వెంకటరమణ తదితరులు అభినందించారు.

ఐకేపీ ఏపీఎం బదిలీ

ఐకేపీ ఏపీఎం బదిలీ