
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌కు గురుకుల విద్యార్థుల ఎంపిక
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని బాలుర గురుకుల కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు శుక్రవారం పీఈటీ జాదవ్ గణేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు జయపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బంగారు పతకం సాధించిన చవాన్ అరవింద్ 100 మీటర్ల పరుగు పందెంలో, గోతి జగదీశ్ 600 మీటర్ల పరుగు పందెంలో ఎంపికై నట్లు చెప్పారు. వారిని అధ్యాపకులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రిన్సిపాల్ గంగాకిషోర్, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ సుమన్, ప్రముఖ పద్యకవి డాక్టర్ బి.వెంకట్, పీడీ నాగరాజు, ఉపాధ్యాయులు వేణుగోపాల్, రాము, గంగాప్రసాద్ ఉన్నారు.
తాడ్వాయి నుంచి ఇద్దరు విద్యార్థులు..
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలకు చెందిన చెందిన ఇద్దరు విద్యార్థులు అథ్లెటిక్స్ ఛాంపియన్‌లో రాష్ట్ర స్థాయికి ఎంపికై న ట్లు పాఠశాల ప్రిన్స్‌పల్ సురేఖ, పీఈటీలు సంధ్య, గంగామణి తెలిపారు. పాఠశాలలో చదువుతున్న రవళి, స్నేహ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటీవల నిర్వహించిన 60 మీటర్ల పరుగు పందెం పోటీలలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలవడంతో రాష్ట్రస్థాయిలో పోటీలలో పాల్గొనేందుకు ఎంపికయ్యారన్నారు. వారిని ప్రిన్సిపల్ సురేఖ, ఉపాధ్యాయులు అభినందించారు.

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌కు గురుకుల విద్యార్థుల ఎంపిక