
మున్సిపల్ కార్మికులకు వైద్య పరీక్షలు
బాన్సువాడ : బాన్సువాడ మున్సిపల్ కార్మికులకు శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ద్య పనులు చేస్తున్న కార్మికులకు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్బంగా మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు మాట్లాడుతూ కార్మికులు బాగుంటేనే పట్టణం బాగుంటుందని అన్నారు. నిత్యం పారిశుద్ద్య పనులు చేస్తున్న పట్టణానికి అందంగా తీర్చిదిద్దుతున్న కార్మికులకు ఏమి చేసిన తక్కువేనని అన్నారు. తెల్లవారు జామున నుంచే వీధులన్నీ శుభ్రం చేస్తున్న మురికికాలువల్లో చెత్త చెదారం తీసివేస్తు సేవలందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సినియర్ అసిస్టేంట్ తుల శ్రీనివాస్, వైద్య సిబ్బంది, తదితరులు ఉన్నారు.
బిచ్కుందలో పారిశుధ్య కార్మికులకు..
బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులకు శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. బిచ్కుంద ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు స్వప్నాలీ పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. మున్సిపల్ కమిషనర్ ఖయ్యూం, ల్యాబ్ టెక్నీషియన్ నరేష్, వైద్య సిబ్బంది పవన్ కుమార్, మోయిన్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.