వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
బీబీపేట/లింగంపేట/తాడ్వాయి : వాహనదారులు రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలతో పాటు వాహనాల ధ్రువపత్రాలు ఉంచుకోవాలని బీబీపేట ఎస్సై ప్రభాకర్ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. తాగి వాహనాలు నడిపిన వారికి జరిమానాలు విధించారు. లింగంపేట మండలకేంద్రం సమీపంలోని నల్లమడుగు చౌరస్తాలో ఎస్సై వెంకట్రావు వాహనాల తనిఖీ నిర్వహించారు. హెల్మెట్ ధరించని వాహన చోదకులకు జరిమానా విధించినట్లు తెలిపారు.తాడ్వాయిలోని కామారెడ్డి –ఎల్లారెడ్డి ప్రధాన రహదారిలో పోలీసులు వాహనాల తనిఖీ చేశారు. హెల్మెట్ ధరించని పలువురికి జరిమానా విధించినట్లు తెలిపారు. మద్నూర్ మండలం మేనూర్ మోడల్ స్కూల్‌లో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు కామారెడ్డి పోలీసు కళాబృందం సభ్యులు సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


